Anushka Shetty Angry: ప్రభాస్ పై అనుష్క ఆగ్రహం.. ఆ విషయంలో హర్ట్ అవడంతో ఇక కలిసి నటించకూడదని నిర్ణయం?

Umair Sandhu Allegations on Prabhas: ప్రభాస్ అనుష్క ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఇప్పటిది కాదు, అయితే వీరిద్దరి గురించి ఇప్పుడు సరికొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 23, 2023, 05:38 PM IST
Anushka Shetty Angry: ప్రభాస్ పై అనుష్క ఆగ్రహం.. ఆ విషయంలో హర్ట్ అవడంతో ఇక కలిసి నటించకూడదని నిర్ణయం?

Anushka Shetty Angry on Prabhas: ప్రభాస్ అనుష్క ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఇప్పటిది కాదు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తూ ఉండేది. ఒకవేళ నిజంగా అలాంటిదే ఏమైనా అంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతారు, ఎప్పుడో చేసేసుకునేవారు కదా అంటూ ప్రభాస్ అభిమానులు కవర్ చేసే ప్రయత్నం చేసినా వీరిద్దరి పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే వస్తోంది.

ఈ మధ్యకాలంలో కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో పడ్డాడు. ఆమెతో ఏడడుగులు వేయబోతున్నాడని మరో ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. ఈ ప్రచారాలు ఎలా తెర మీదకు వస్తున్నాయో ఏమిటో ప్రభాస్ కి అయినా తెలుసో లేదో కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే భవిష్యత్తులో ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయకూడదు అని అనుష్క నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సందు తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

అనుష్క ప్రస్తుతం నటిస్తున్న సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రభాస్ ఒక విషయంలో దారుణంగా అనుష్కను హార్ట్ చేశాడని ఈ నేపథ్యంలో అనుష్క ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ మధ్యకాలంలో ఉమైర్ సందు కేవలం బాలీవుడ్ వారిని మాత్రమే కాకుండా సౌత్ లో క్రేజీ హీరోలుగా ఉంటున్న అనేక మంది హీరోల గురించి కూడా అనేక సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా ప్రభాస్ గురించి కూడా ఉమైర్ సందు కామెంట్ చేశాడు.

అయితే అభిమానులందరూ అసలు ఈ వ్యక్తి ఉన్నాడో లేడో కూడా తెలియదు ఎక్కడో కూర్చుని ఇక్కడ ఏవో జరిగిపోతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ప్రభాస్ తో అనుష్క సినిమా చేయను అని కామెంట్ చేయడం అయితే నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమా కూడా ప్రభాస్ సొంత ప్రొడక్షన్ గా భావించే యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరో పాత్రలో నటిస్తున్నాడు.

Also Read: Real Guru Sukumar: సుకుమార్ శిష్యులు అంతా సూపర్ సక్సెస్.. రియల్ గురూ ఆయనే!

Also Read: Balagam Collections: 20వ రోజు కూడా 1.76 కోట్లు వసూలు చేసిన బలగం.. ఇది కదా బలమంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x