Samantha Hugs her personal fitness Trainer and Shares Photo: ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత అనూహ్యంగా అనేకసార్లు వార్తల్లోకి వస్తూనే ఉంది. ఆమె విడాకుల గురించి ఎక్కువ రోజులు చర్చ జరిగింది. ఇక ఈ మధ్యనే ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నా అని ప్రకటించినప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని కూడా కొన్ని వార్తలు బయటకు రాగా ఆమె అంత ప్రాణాపాయం లేదని తన లేటెస్ట్ మూవీ యశోద ప్రమోషన్స్ లో బయట పెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఎట్టకేలకు ఆమె యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆమె అభిమానులు కొంత ధైర్యంగా ఉన్నారు. యశోద సినిమా కాస్త హిట్ టాక్ తెచ్చుకోవడంతో సమంత అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె మాజీ భర్త నాగచైతన్య థాంక్యూ అలాగే మాజీ మామ ది ఘోస్ట్ సినిమాల కలెక్షన్స్ విషయంలో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రెండు సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్ కంటే సమంత సినిమా మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని వారంతా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.





అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సమంత తన సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక వ్యక్తికి హగ్ ఇస్తూ దాని ఫోటో షేర్ చేయడం ఇప్పుడు మారింది. అయితే అతను మరెవరో కాదు సమంత ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. కొన్నాళ్ల నుంచి సమంతకు అతనే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. సమంత బాడీ అంత ఫిట్ గా ఉండడానికి అలాగే యాక్షన్ సీన్స్ లో స్టిఫ్ గా ఆమె పెర్ఫార్మ్ చేయడానికి కూడా కారణం అతనేనట.  ఈ విషయాన్ని సమంత వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకుంది నేను అతని చేతుల మీదుగా జిలేబి తింటానని అతను ఎప్పుడూ అనుకుని ఉండడు కానీ ఈరోజు అదే జరిగింది అంటూ ఆమె పేర్కొంది.


యశోద సక్సెస్ నేపధ్యములో అతను నాకు జిలేబీ తెచ్చి ఇచ్చాడని, ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ కోసం ఇది తెచ్చిచ్చాడని ఆమె పేర్కొంది. గత కొన్ని నెలలుగా నా బాధలు అన్నింటిని చూసిన కొద్ది మంది వ్యక్తులలో మీరు కూడా ఉన్నారని, నా అత్యల్ప స్థాయి... నా బలహీనత, కన్నీళ్లను, అధిక మోతాదు స్టెరాయిడ్ చికిత్సలను ఇలా అన్నింటినీ మీరు కూడా చూశారని సమంత పేర్కొంది. అయినా సరే మీరు నన్ను ఓడిపోనివ్వ లేదు, అలాగే మీరు నన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వరని నాకు తెలుసని ఆమె పేర్కొంది. 
Also Read: Urvashi in Waltair Veerayya: ఐటెం భామ కాదండోయ్..వాల్తేరు వీరయ్యతో ఊర్వశి పెద్ద ప్లానే వేసిందట!


Also Read: Shahrukh Khan Stopped: చిక్కుల్లో స్టార్ హీరో.. గంట పాటు ఎయిర్ పోర్టులో నిలిపేసి ప్రశ్నించిన అధికారులు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి