Samantha about Naga Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  ఇన్నేళ్ల కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసి దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోలతో పనిచేసి ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. సమంతకి సినిమాల పరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందో తెలియదు కానీ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆమెకు చాలా ఎదురుదెబ్బలే తగిలాయని చెప్పవచ్చు.  ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సమస్యలన్నీ కూడా రెండేళ్ల క్రితమే. వీటన్నింటి నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటూ ఉండడంతో మళ్ళీ సమంత పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ బాధ నుంచి సమంత బయటపడేలోపే మరొకవైపు తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సమంత సహా అక్కినేని కుటుంబం మొత్తం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఇక కష్టం ఏదైనా మరిచిపోవడం అలవాటు చేసుకున్న సమంత తాజాగా తన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి ఈ వెబ్ సిరీస్ స్పై థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే నిజజీవితంలో కూడా స్పై ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించగా.. ఆమె నేనెప్పుడూ అలా స్పై చేయలేదు. ఒకప్పుడు అలా స్ప్రై చేసి ఉంటే బాగుండేది అంటూ నవ్వుతూ సమాధానం తెలిపింది. దీంతో సమంత, నాగచైతన్య కోసమే ఈ కామెంట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter