Samantha Mammootty Movie: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత వెండితెర మీద కనిపించి.. దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది..ఆమెను మళ్లీ వెండితెర మీద చూడటానికి.. అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు సమంత బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ లో మాత్రమే నటిస్తోంది.. తప్ప సినిమాలు చేయడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సమంత.. మరో రెండు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తమిళ్లో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మలయాళం లో కూడా మమ్ముట్టి హీరోగా ఒక నటిస్తున్న ఒక సినిమాలో.. సామ్ హీరోయిన్ గా ఎంపిక అయింది గాని వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో ఆమె మలయాళం లో కూడా అడుగుపెట్టబోతోందని వార్తలు వచ్చాయి. 


తాజాగా ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేశారు డైరెక్టర్ గౌతమ్ మీనన్. కానీ సమంత మాత్రం కనిపించకపోవడం.. అందరికీ షాక్ ఇచ్చింది. ఒకవేళ ఏదైనా పని ఉండి రాకపోయి ఉన్నా కూడా.. ముఖ్యమైన వేడుక కాబట్టి కనీసం దాని గురించి ఒక ట్వీట్ అయిన పోస్ట్ అయినా పెట్టి ఉంటే సరిపోయి ఉండేది. 


కానీ సమంత అలా కూడా చేయకపోవడంతో అసలు ఈ సినిమాలో ఆమె నటించడం లేదేమో.. అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఏమో సినిమా ఒప్పుకొని లాస్ట్ కి సైడ్ అయిపోయినట్టుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కారణం ఏమైందో తెలియదు కానీ సమంత ఈ సినిమాలో నటిస్తుందో లేదో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. 


మరోవైపు తెలుగులో కూడా సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ట్రాలాలా.. మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తోంది. మరి స్వీయ నిర్మాణంలో.. సమంత ఎంత వరకు హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.


Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!


Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి