Samantha Entered in Hollywood: నాగ చైతన్యతో (Nagachaitanya) విడాకులు తీసుకున్న తరువాత సమంత (Samantha) పూర్తిగా కెరీర్ పై దృష్టి సారించింది.  వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ గా  అవుతుంది. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అన్ని విధాల ఆచూతూచి అడుగులు వేస్తుంది ఇటీవలే "శాకుంతలం" (Shakunthalam) సినిమా షూటింగ్ ఖతం చేసిన సమంత ఒక థ్రిల్లర్ సినిమాకి ఓకే చెప్పగా.. హీరోయిన్ తాప్సితో ఒక సినిమా సైన్ చేశారన్న సంగతి మనకు తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో విషయం ఏమిటంటే.. విడాకులు తీసుకున్న తరువాత ఐటెం సాంగ్ లకు కూడా ఒకే చెప్తున్నారని.. పాత పంతాలోకి చేరారని ఇండస్ట్రీలో టాక్..  అల్లు అర్జున్ - సుకుమార్ (Allu Arjun - Sukumar Combo) కాంబో లో తెరకెక్కుతున్న 'పుష్ప' (Pushpa) సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. మరో హాలీవుడ్ (Hollywood) సినిమాలో కూడా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. 


Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!


ఓబేబి (Oh Baby) సినిమాను నిర్మించిన సునీత తాటి (Sunitha Thati) మరో సినిమా నిర్మించబోతున్నారని సమాచారం. ఓబేబీలో కూడా సమంత ముఖ్య  పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే! సునీత తాటి నిర్మించబోతున్న 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే సినిమాలో కూడా సమంత నటించబోతుందని ప్రచారం..


ఈ సినిమాకి హాలీవుడ్ డైరెక్టర్ 'ఫిలిప్ జాన్' (Philip Jonh) దర్శకత్వం వహించబోతున్నారట.. 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే సినిమాని 'తిమెరి యన్ మురారి' ఫేమస్ నవల ఆధారంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఎంపిక అయినప్పటికీ హీరో ఎంపిక అవ్వలేదని సమాచారం. ఈ సినిమా కొంత భాగం ఇండియాలో జరగనుండగా.. వేల్స్ లో మిగతా భాగం షూటింగ్ జరగనుంది. సౌత్ లో అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సమంత.. బాలీవుడ్ (Bollywood) లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇక హాలీవుడ్ లో ఏ తరహాలో ఆకట్టుకుందో చూడాలి. 


Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook