Samantha New Conditions To Directors: టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్ (Kollywood), బాలీవుడ్ (Bollywood) ఇండ్రస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారిన సమంత- నాగ చైతన్య విడాకుల (Chaisam Divorce) వ్యవహారం మన అందరికీ తెలిసిందే..  అయితే సమంతపై (Samantha) సోషల్ మీడియాలో పుకార్లు రావటం సమంత పెట్టిన పోస్ట్ కి సోషల్ మీడియా రూమర్స్ స్టార్స్ సైలెంట్ అవ్వటం మనం చూసిందే..!! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సమంత ప్రస్తుతం తన కెరీర్ ను బిజీ షెడ్యూల్ తో నింపేయాలని చూస్తుందట. దీని కోసం గాను అన్ని ప్రాజెక్ట్ లకు  ఓకే  చెప్తుందట. వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యలు సినిమా కెరీర్ పై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతుంది సామ్.. శాకుంతలం (Shakunthalam) సినిమా షూటింగ్ పూర్తీ చేసిన సామ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) తమిళంలో 'కాత్తు వాక్కుల రెండు కాదల్‌'లో (Kathu Vakkula Rendu Kadal) నటిస్తుంది. 


Also Read: Bus catches fire: మంటల్లో కాలిబూడిదైన బస్సు


అయితే సమంత ప్రస్తుతం ఓకే చెప్తున్న సినిమాలకు కొత్త షరతులు పెడుతుందట. షరతులకు ఓకే చేసిన సినిమాలకు మాత్రమే సైన్ చేస్తుందని టాక్. అటు సమంత పెట్టే షరతులు మరీ అంత ఇబ్బందికరంగా లేకపోవటం వలన దర్శకులు కూడా సరే అంటున్నారు. నిజానికి ఆ షరతులు ఏంటంటే.. సినిమా షూటింగ్ చెన్నై (Chennai) ప్రాంతంలో ఉండాలని, ఒకవేళ హైదరాబద్ (Hyderabad)లో షూటింగ్ ఉంటే మాత్రం.. ఇండోర్ లో మాత్రమే ఉండాలని చెప్తుందట.. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్స్ మాత్రం పబ్లిక్ ప్లేసులో, జనాలు ఉండే చోట ఉండొద్దని దర్శకులకు విజ్ఞప్తి చేస్తుందట.. ఇక తన షరతులకు అంగీకరించిన దర్శకులతో సినిమాలు చేయటానికి సమంత రెడీ అవుతుందని టాక్. విడాకుల తరువాత హైదరాబాద్ లో ఉండటానికి ఇష్టపడటం లేదని.. మరి ఇంకాస్త సమయం చెన్నై లోనే ఉండాలని చూస్తుందట సమంత!


Also Read: Yuvraj Singh arrested: యువరాజ్ సింగ్ అరెస్ట్.. Bail పై విడుదల


తెలుగు- తమిళ (Telugu- Tamil) భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కోసం సమంత (Samantha) ఏకంగా 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివలెంక కృష్ణ ప్రసాద్‌ (Shiva Lenka Krishna Prasad) నిర్మించబోతున్న సినిమా కోసం సమంతను కలిసినపుడు ఆమె ఈ షరతులు పెట్టిందని సమాచారం. ఒకప్పుడు నయన తార (Nayanatara) కూడా ఈ తరహా షరతులు పెట్టినందుకు గాను.. సమంత కూడా అదే దారిలో నడుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook