Private travels bus catches fire : జనగాం: జనగాం జిల్లాలో నెల్లుట్ల వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు నిప్పంటుకుని బస్సు మొత్తం దగ్ధమైంది. అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడినట్టు జనగాం పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన కృష్ణా ప్రైవేటు బస్సు జనగామ సమీపంలోని నెల్లుట్ల వద్దకు రాగానే ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు ఇంజన్‌లోంచి పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఓ పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో బస్సులో ఉన్న సుమారు 26 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ చూస్తుండగానే మంటలు బస్సు (Bus fire accident) మొత్తానికి వ్యాపించాయి.
Also read : AP, Telangana weather forecast: తెలంగాణ, ఏపీకి వర్షసూచన.. మరో రెండు రోజులు తప్పని Heavy rains
ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించినప్పటికీ.. అప్పటికే ఆలస్యం అవడంతో బస్సు మంటల్లో (Bus catches fire on road) చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Also read : Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటించాడు
Also read : AP Three Capital Issue: మూడు రాజధానులతో కేంద్రానికి సంబంధం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook