Yuvraj Singh arrested: యువరాజ్ సింగ్ అరెస్ట్.. Bail పై విడుదల

Yuvraj Singh arrested over casteist remarks: రజత్ కల్సన్ ఫిర్యాదుతో హన్సి పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌ సింగ్‌పై ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ యాక్ట్ (SC ST attrocities Act) కింద కేసు నమోదైంది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు యువరాజ్‌ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసినట్టు హన్సి డిఎస్పీ వినోద్ శంకర్ మీడియాకు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 09:20 AM IST
Yuvraj Singh arrested: యువరాజ్ సింగ్ అరెస్ట్.. Bail పై విడుదల

Yuvraj Singh arrested over casteist remarks: చండీగఢ్‌:  టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను హర్యానా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను (Yuvraj Singh, Yuzvendra Chahal) ఉద్దేశించి మాట్లాడుతూ.. కులదురహంకార వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యువరాజ్ సింగ్‌పై అప్పట్లోనే ఓ కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు యువిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం యువి వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు.. మధ్యంతర బెయిల్‌పై ఆయన్ను విడిచిపెట్టారు. 

ఒక బాధ్యత కలిగిన క్రికెటర్ అయ్యుండి ఒక సామాజిక వర్గాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ దళిత హక్కుల నేత రజత్ కల్సన్‌ హన్సి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రజత్ కల్సన్ ఫిర్యాదుతో హన్సి పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌ సింగ్‌పై ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ యాక్ట్ (SC ST attrocities Act) కింద కేసు నమోదైంది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు యువరాజ్‌ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసినట్టు హన్సి డిఎస్పీ వినోద్ శంకర్ మీడియాకు తెలిపారు. 

Also read : Dale Steyn:'టీమిండియా బౌలింగ్ కోచ్‎గా పని చేయాలనుంది'..మనసులో మాట బయటపెట్టిన స్టెయిన్!

యువరాజ్ సింగ్ వ్యాఖ్యలపై అప్పట్లోనే నెటిజెన్స్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెను దుమారం చెలరేగింది. దీంతో తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు (Yuvraj Singh comments on Yuzvendra Chahal, Kuldeep Yadav) చేయలేదని, తెలిసో తెలియకో ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే అందుకు వారిని క్షమాపణలు కోరుతున్నానని ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also read : T20 World Cup 2021: 'విరాట్ కోహ్లీ కోసం కప్ గెలవండి': సురేష్ రైనా

Also read : Watch: బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్...ఫీల్డర్ కు సలాం చేస్తున్న క్రికెట్ అభిమానులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News