Samantha Religion : పూజ గదిలో సమంత.. హిందువా? క్రైస్తవురాలా?.. నెట్టింట్లో చర్చలు
Samantha Performs Pooja in Home సమంత తన ఇంట్లో పూజ గదిలో కనిపించింది. చూస్తుంటే ఆమె పూజ గదిలోనే ధ్యానం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ ఫోటోను సమంత షేర్ చేయడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
Samantha Hindu Or Christian సమంత ప్రస్తుతం తన ఇంట్లోని పూజ గదిలో ధ్యానం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే దైవారాధనలో సమంత మునిగినట్టుగా ఉంది. అయితే ఈ ఫోటోను, ఆమె పెట్టిన క్యాప్షన్‌ను చూసి జనాలు ఆమె మతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆమె క్రిస్టియన్ కదా? హిందూ మతంలోకి ఎప్పుడూ వచ్చింది? అసలు సమంత ఏ మతానికి చెందిన వ్యక్తి అంటూ ఇలా నానా రకాలుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
సమంత క్రిస్టియన్ అన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో సమంత వివాహాం రెండు మతాల సంప్రదాయ పద్దతుల్లో జరిగింది. క్రిస్టియన్ పద్దతిలో వివాహాం, హిందూ పద్దతిలో తాళి కట్టడం అందరికీ తెలిసిందే. అయితే సమంత మాత్రం క్రమక్రమంగా హిందూ మతంలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఛార్ ధామ్ యాత్ర చేయడం, గుడి మెట్లు ఎక్కుతూ మొక్కులు తీర్చుకోవడం అందరికీ తెలిసిందే.
సమంత ఏ మతానికి చెందిన వ్యక్తి అంటూ అప్పట్లోనూ చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సమంత మతం మీద నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత తాజాగా పూజ గదిలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. నమ్మకం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు, ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు హిందూ మతంలోకి ఎప్పుడు మారిపోయింది? అసలు సమంత ఏ మతానికి చెందిన వ్యక్తి అంటూ ఆరాలు తీస్తున్నారు.
సమంత ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ అవ్వడం, ఆ వెంటనే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ ఖుషి సినిమా సెట్‌లోకి అడుగు పెట్టడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్‌తో సమంత అయితే బిజీగా ఉంది.
సమంత తన మయోసైటిస్ కారణంగా ఆరేడు నెలలు మంచానికే పరిమితమైన సంగతి తెలిసిందే. యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సమంత బయటకు రాలేకపోయింది. శాకుంతలం సినిమా కోసం కష్టపడి బయటకు వచ్చింది. ట్రైలర్ ఈవెంట్‌లో సమంత కన్నీరు పెట్టిన విజువల్స్ అందరినీ కదిలించాయి.
Also Read: Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్
Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook