Samantha Ruth Prabhu Hyperbaric సమంత ప్రస్తుతం కొన్ని ఫోటోలను షేర్ చేసింది. గత వారం అంతా కూడా ఎలా గడిచిందో చెప్పేందుకు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇందులో ఓ ఫోటోలో సమంత ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని హైపర్ బెరిక్ థెరపీ అని అంటారట. దీని వల్ల ఆటో ఇమ్యూనిటీ పెరుగుతుందట. అటీజం తగ్గుతుందట. న్యూరో డీజెనెరెటీవ్ కండీషన్ మెరుగు పడుతుందట. ఇన్‌ఫ్లామెషన్ తగ్గిస్తుందట. ఇన్‌ఫెక్షన్‌లను తగ్గిస్తుందట. దెబ్బ తిన్న కణాలను తిరిగి మామూలు స్థితిలోకి తీసుకొస్తుందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సమంత తాజాగా ఇలా కనిపించడంతో మళ్లీ హాస్పిటల్‌లో జాయిన్ అయిందా? షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తుందా? అని అంతా అనుకున్నారు. మళ్లీ ఆరోగ్యం తేడా కొట్టేసిందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో సమంత చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. ఇంకా తన ఆరోగ్యం సెట్ అవ్వలేదని, స్టైల్ కోసం ఇలా అద్దాలు పెట్టుకోవడం లేదని, తాను లైట్‌ను కూడా భరించలేకపోతోన్నాను అని అందుకే ఇలా కళ్లద్దాలు పెట్టుకున్నానని చెప్పిన సంగతి తెలిసిందే.


 



సమంత లండన్‌కు సిటాడెల్ ప్రమోషన్స్ కోసం వెళ్లింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో సమంత, రాజ్ అండ్ డీకే, షాహిద్ కపూర్ ఇలా అందరూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో సమంత తెగ నవ్వుతూ కనిపించింది. హాట్ లుక్కులో మెరిసింది. ఇక్కడ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం ఏడుస్తూ కనిపించి సింపతీ కొట్టేసేందుకు ప్రయత్నించింది.. అక్కడేమో నవ్వుతూ హాట్ లుక్కులో కనిపించిందంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.


Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక


అయితే ఇప్పుడు ఇలా హైపర్ బెరిక్ థెరపి చేయించుకుంటూ కనిపించడంతో ఏమై ఉంటుందా? అని అనుకుంటున్నారు. మయోసైటిల్ వల్ల కణాలు, కండరాలు, బోన్స్ దెబ్బ తిని ఉంటాయని, దాని కోసం బ్లెడ్ సర్క్యూలేషన్ సరిగ్గా అవ్వడానికే ఇలా థెరపీ చేయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సమంత మాత్రం ఇంకా ఆ మయోసైటిస్ నుంచి బయట పడలేదని కనిపిస్తోంది.


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook