Samantha Six Pack Workout Pic సమంత వర్కౌట్లకు సంబంధించిన ఫోటోను చూసి జనాలు ఆశ్చర్యపోతోన్నారు. సమంత సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తోందా? అన్నట్టుగా కనిపిస్తోంది. సమంత తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆమె పొట్ట భాగం ఎంతో ఫిట్‌గా కనిపిస్తోంది. ఆల్రెడీ ప్యాక్స్ పడ్డట్టుగా అనిపిస్తోంది. చూస్తుంటే సమంత ఏదో పెద్ద ప్లానింగే వేసినట్టు అనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత గత ఏడాది ఎన్ని బాధలు అనుభవించిందో అందరికీ తెలిసిందే. యశోద సినిమా షూటింగ్ టైంలోనే మయోసైటిస్‌తో బాధపడుతూ ఉంది. అయితే సినిమా విడుదల సమయంలో బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. అందుకే బెడ్డు మీద నుంచే డబ్బింగ్ చెప్పింది. యశోద సినిమాకు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. తాను మయోసైటిస్‌ వల్ల ఎంతగా బాధపడుతూ ఉందో వివరించింది.


అయితే సమంత మళ్లీ బయటకు వస్తుందా? అడుగు తీసి అడుగు వేస్తుందా? సినిమాల్లో నటిస్తుందా? మునుపటిలా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది సమంత. మునుపటి కంటే రెట్టింపు శక్తి, వేగంతో ఆమె వర్కౌట్లు చేస్తోంది. ఆమెను చూసి అంతా అవాక్కవుతున్నారు. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నావా? అని అడిగేస్తున్నారు.


 



ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకేతో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. వరుణ్ ధావణ్, సమంతలు కలిసి ఈ ప్రాజెక్ట్‌లో మ్యాజిక్ చేయబోతోన్నారు. ఇక ఇది కాకుండా సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది. మామూలుగా అయితే ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ సమంతకు హెల్త్ బాగా లేకపోవడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఈ మధ్యే సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లను సమంత పూర్తి చేసేందుకు బాగానే కష్టపడుతోంది. 


సమంత నాగ చైతన్యతో విడాకుల తరువాత చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. నాగ చైతన్య సినిమాల మీద స్పందించదు. నాగ చైతన్యకు బర్త్ డే విషెస్ కూడా చెప్పదు. కానీ మిగతా హీరోలందరికీ విషెస్ చెబుతూ.. వారి వారి సినిమాల మీద స్పందిస్తూ అభినందనలు తెలుపుతూ ఉంటుంది.


Also Read:  Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన


Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook