Samantha Ruth Prabhu on Rana Naidu Trailer సమంత ప్రస్తుతం అక్కినేని హీరోలు, దగ్గుబాటి వారితో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. నాగార్జున, నాగ చైతన్యలతో మాత్రం దూరాన్ని పాటిస్తున్నట్టుగా ఉంది. అఖిల్ ఏజెంట్ అప్డేట్ల మీద సమంత స్పందిస్తుంటుంది. సుమంత్, సుశాంత్ వంటి వారితోనూ బాగానే ఉంటుంది. వెంకీమామ కూతురు ఆశ్రితకు రిప్లైలు ఇస్తుంటుంది. రానా, మిహికాల మీద రియాక్ట్ అవుతుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా సమంత దగ్గుబాటి, అక్కినేని వారితో బాగానే ఉంటోంది. తాజాగా రానా నాయుడు ట్రైలర్ మీద స్పందించింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మార్చి 10న నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ మీద సమంత స్పందించింది. తన రియాక్షన్‌ను చెప్పేసింది. సమంత చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.


రానా నాయుడు ట్రైలర్‌లో కాస్త ఘాటైన అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి. బూతులు ఎక్కువగా ఉన్నాయి. అయితే చిన్నప్పుడు నీ ముడ్డి కడిగాను అంటూ వెంకీ మామ చెప్పిన డైలాగ్ అదిరిపోయిందట. సమంతకు ఆ డైలాగ్ బాగా నచ్చిందట. ఈ మేరకు సమంత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


 



రానా, వెంకీమామలు అదరగొట్టేశారు.. ఎప్పుడెప్పుడూ ఈ వెబ్ సిరీస్ చూస్తానా? అని ఆగలేకపోతోన్నాను అంటూ సమంత చెప్పేసింది. ఇక సమంత ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. మయోసైటిస్ పూర్తిగా తగ్గినట్టు కనిపిస్తోంది. సమంత చేస్తోన్న వర్కౌట్లు, తీర్చుకుంటున్న మొక్కులు చూస్తుంటే మునుపటి కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోతోన్నట్టుగా కనిపిస్తోంది.


[[{"fid":"262787","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక సమంత ఇప్పుడు సిటాడెట్ వెబ్ సిరీస్‌ కోసం ఎక్కువగా టైం కేటాయించింది. వరుణ్‌ ధావన్ హీరోగా రాబోతోన్న ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది కాకుండా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను కూడా సమంత పూర్తి చేయాల్సి ఉంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ పాటికే పూర్తయి థియేటర్లో సినిమా సందడి చేయాల్సింది. కానీ సమంతకు మయోసైటిస్ రావడంతో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందన్న సంగతి తెలిసిందే.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook