Samantha Ruth Prabhu About North And South Films: ఉత్తరాదిన విడుదలవుతున్న చిత్రాలకు, దక్షిణాది చిత్రాలకు మధ్య వ్యత్యాసం గురించి సమంత రుతు ప్రభు కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో శాకుంతలం ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సమంత.. ఇండియాలో ప్రస్తుతం సినిమాల ట్రెండ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఉత్తరాది చిత్రాలకు, దక్షిణాది చిత్రాలకు మధ్య అడ్డుగోడలు ఏవీ లేవని కామెంట్ చేసిన సమంత.. ఇప్పుడు అన్ని భాషలకు చెందిన ఆడియెన్స్ అన్ని చిత్రాలు చూస్తున్నారని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాకుంతలం ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సమంత.. అక్కడ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. బాలీవుడ్ చిత్రాలకు, దక్షిణాది చిత్ర పరిశ్రమలు తెరకెక్కిస్తున్న సినిమాలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి చర్చలకు తావు ఇవ్వడం తనకు ఇష్టం లేదన్న సమంత.. ఒక నటిగా అన్ని భాషల చిత్రాల్లో పనిచేయగలగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఆడియెన్స్ కూడా తమ సొంత భాషలతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలను వీక్షిస్తున్నారు అని సమంత అభిప్రాయపడ్డారు. 


కాళీదాసు రచించిన శకుంతల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ముందుకు రానుంది. దుశ్యంత్ మహారాజుకు భార్యనే ఈ శకుంతల. పురాణాల్లో ఒక అద్భుతమైన ప్రేమకావ్యం సెల్యూలాయిడ్‌పై చిత్రం రూపంలో రాబోతోంది. రుద్రమదేవి మూవీ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ గుణశేఖర్ మరోసారి ఈ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్‌పై గుణశేఖర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇది కూడా చదవండి : Tanisha Kuppanda Interview: యూట్యూబర్‌పై కేసు పెట్టిన హీరోయిన్.. ఇంతకీ అతడు ఏం అడిగాడంటే..


ఇది కూడా చదవండి : Rithu Chowdary Photos: బీచ్ ఒడ్డున పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన రీతూ చౌదరి.. అందాలు దాచతరమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook