Samanatha Next Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ సమంత. తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషలలోనూ ఈమెకు ఫాన్స్ ఉన్నారు. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా హిందీలో సైతం అభిమానులను సంపాదించుకుంది. వరస సినిమాలతో బిజీగా ఉండే సమంత ఈమధ్య తన ఆరోగ్య సమస్యల వల్ల చాలా రోజులు సినిమాలకి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఆరోగ్య రీత్యా మధ్యలో రెస్ట్ తీసుకున్న సమంత ఆ తరువాత చకచక యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల షూటింగ్ ని ముగించుకుంది. ఇక మళ్ళీ కొద్ది రోజులు విశ్రాంతికి కేటాయించింది ఈ హీరోయిన్. దీంతో సమంత అభిమానులందరూ మళ్ళీ సమంత ఎప్పుడు మీడియా ముందర కనిపిస్తుందో సినిమాలు ఎప్పుడు చేస్తుందో అంటూ తహతహలాడిపోయాడు. ఈ నేపథ్యంలో సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.


ప్రస్తుతం సమంత ఒప్పుకున్నా కొత్త సినిమాలేమి లేవు. కానీ గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే ఓ సిరీస్ చేసింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది. అయితే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా విడుదల మాత్రం నోచుకోలేదు. ఈ సిరీస్ షూటింగ్ అయిపోయినా సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ సిరీస్ అక్కడే ఆగిపోయింది. మధ్యలో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకి ఎలాగోలా డేట్ సజెస్ట్ చేసిన సమంత ఈ సిరీస్ కి మాత్రం అడ్జస్ట్ చేయలేకపోయింది.


కానీ ఇప్పుడు మళ్లీ ఆ సీరియస్ కోసం తిరిగి వచ్చింది ఈ హీరోయిన్. తాజాగా ఈ సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత. ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ సిటాడెల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే రాజ్ & డీకే టీంతో ల్యాప్ టాప్ లో సిటాడెల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలని కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలని షేర్ చేస్తూ దాదాపు 22 నెలల తర్వాత అంటే ఒకటిన్నర సంవత్సరం తరువాత ఈ ప్రాజెక్టు రెడీ అయింది అని పోస్ట్ చేసింది.


 



ఇక ఈ పోస్ట్ చూసి సమంత అభిమానులు ఖుషి అవుతున్నారు. వెండితెర పైన కాకపోయినా బుల్లితెర పైన అన్న తమ అభిమాన హీరోయిన్ చూడవచ్చని సంబరపడుతున్నారు.


Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
 


Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి