Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.. సామ్ రివ్యూ హైలెట్.. ట్వీట్ వైరల్
Samantha Review on Shaakuntalam సమంత తాజాగా శాకుంతలం సినిమాను వీక్షించింది. సినిమాను చూసిన తరువాత సమంత తన స్టైల్లో రివ్యూ ఇచ్చింది. ఎంతో అద్భుతంగా ఉందని, పిల్లలందరికీ ఈ చిత్రం నచ్చుతుందని చెప్పుకొచ్చింది.
Samantha Ruth Prabhu Watches Shaakuntalam సమంత తన కొత్త సినిమా శాకుంతలంను కాసేపటి క్రితమే చూసిందట. ఈ మేరకు సినిమా చూసిన తరువాత సమంత ఇలా పోస్ట్ వేసింది. 'మొత్తానికి సినిమాను నేడు చూసేశాను. గుణశేఖర్ గారు నా మనసును దోచేశారు. ఎంతో అద్భుతంగా ఉంది సినిమా. మన పురాణ గాథను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ ఎమోషన్స్‌ను మన ఫ్యామిలీ ఆడియెన్స్ కచ్చితంగా చూడాల్సిందే. ఈ మాయా ప్రపంచాన్ని పిల్లలందరూ కచ్చితంగా ఇష్టపడతారు. దిల్ రాజు గారు, నీలమ వల్లే ఈ ప్రయాణం ఇంత అద్భుతంగా మారింది. ఈ చిత్రం ఎప్పటికీ నా మనసుకి దగ్గరగా నిలుస్తుంది అంటూ సమంత తన స్టైల్లో రివ్యూ ఇచ్చింది.
శాకుంతలం సినిమాను గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ కథను తీయాలని నీలిమ గుణ సజెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సమంత పేరుని కూడా నీలిమ గుణయే ముందు పెట్టింది. ఇలా నీలిమ గుణ ముందుండి నడిపిన ఈ ప్రాజెక్ట్‌కు అడుగడుగునా ఆటంకాలే ఏర్పడ్డాయి.
సినిమా షూటింగ్‌లకు కరోనా అడ్డు పడితే.. అన్నపూర్ణలోనే సెట్‌లు వేసి గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్‌లతో కవర్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత పూర్ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్, సీజీ వర్క్ మీద నెటిజన్లు పెదవి విరిచారు. కానీ ఇచ్చిన బడ్జెట్లో అంతకంటే ఎక్కువగా చేసేట్టుగా కూడా కనిపించడం లేదు. ఇవన్నీ ఒకెత్తు అయితే సినిమా మాటిమాటికి వాయిదాలు పడుతూనే వస్తోంది. ఇప్పటికైతే ఏప్రిల్ 17న ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. మళ్లీ ఇందులోనూ ఏమైనా మార్పు వస్తుందా? లేదా? అన్నది చూడాలి.
అసలే ఎలాంటి హైప్ గానీ బజ్ గానీ లేని ఈ సినిమా థియేటర్లో ఎలా ఆడుతుందా? అని అంతా అనుకుంటున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా సమంతతో రివ్యూ చెప్పించి.. ఓ పోస్ట్ వేయించినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా అసలు థియేటర్లో వర్కౌట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.
Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook