Samantha second marriage: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత 2017లో.. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వారి మధ్య ప్రేమ.. ఎక్కువ రోజులు నిలబడలేదు. 2021 లో తాము విడిపోతున్నట్లుగా.. అధికారికంగా ప్రకటించింది ఈ జంట. అయితే విడాకుల తర్వాత.. వ్యక్తిగతంగా కూడా సమంత చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నిటిని దాటుకుంటూ.. సమంత స్ట్రాంగ్ గా బయటకు వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే.. శోభితతో ప్రేమాయణం మొదలుపెట్టిన నాగచైతన్య.. ఈ మధ్యనే ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయంలో నాగచైతన్య మీద బాగానే ట్రోల్స్.. వినిపిస్తున్నాయి. మరోవైపు సమంత అభిమానులే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులు కూడా.. సోషల్ మీడియాలో సమంతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. 


ఈ నేపథ్యంలోనే ఒక ఫ్యాన్.. ఒక ఫన్నీ వీడియోని విడుదల చేశాడు. నేను మీకోసం ఎప్పుడూ తోడుగా ఉంటాను.. అంటూ బ్యాగ్రౌండ్ లో సమంత ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేస్తున్నట్లు.. ఆ ఫ్యాన్ వీడియో చేశాడు. అందులో “మీరు ఏమీ బాధపడవద్దు. నేనెప్పుడూ మీకు తోడుగానే ఉంటాను. ఒక రెండేళ్లు సమయం ఇస్తే ఆర్థికంగా కూడా స్థిరపడి.. నీ దగ్గరికి వస్తాను. నా ప్రామిస్ లాగా ఈ హార్ట్ తీసుకోండి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి" అంటూ ఒక పింక్ కలర్ హార్ట్ ను పట్టుకుని ఆ వీడియోలో సమంతకి ప్రపోజ్ చేశాడు ఆ అభిమాని. 


 



ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. ఏకంగా సమంత ఆ పోస్ట్ కి రిప్లై ఇచ్చింది. "బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఆ జిమ్ చూసి నేను దాదాపు కన్విన్స్ అయిపోయాను" అంటూ చెప్పుకొచ్చింది. ఇక సమంత ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమాని పెళ్లి ప్రపోజల్ కి..ఓకే చెప్పేసిన సమంత.. అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. 


ఇక ఆ అభిమాని.. సంతోషానికి అవధులు లేవు. సాధారణంగా పెట్టిన వీడియోకి సమంతానే రిప్లై ఇవ్వడంతో ఆ ఫ్యాన్ చాలా సంతోష పడిపోయారు. వీళ్లిద్దరి మధ్య క్యూట్ కాన్వర్జేషన్ అభిమానుల దృష్టిని ఆకట్టుకుంటుంది. మరోవైపు సమంత తిరిగి సంతోషంగా ఉండాలి అని.. ఆమె కోరుకున్న విజయాలు ఆమెకు దక్కాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం


Also Read: KTR Emotinal: జైలులో కవిత దుర్భరంగా ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ఆవేదన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter