Shaakuntalam Disaster at Box Office సమంత శాకుంతలం సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తుందని, కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంలో నాలుగు రోజుల ముందే అందరికీ క్లారిటీ వచ్చింది. అసలు శాకుంతలం సినిమా మీద ఎప్పుడూ పాజిటివ్ బజ్ వచ్చింది లేదు. శాకుంతలం సినిమా మీద జనాలకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనేలానే ట్రెండ్ కనిపించింది. చివరకు త్రీడీలో ఈ సినిమాను మార్చేశారు. అయినా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదు. ఏ మాత్రం చడీచప్పుడు లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని తీసుకొచ్చేలా ఉంది. నీలిమ గుణ, దిల్ రాజులకు ఈ సినిమాతో భారీ మొత్తంలో నష్టం వచ్చేలా కనిపిస్తోంది. మామూలుగా అయితే కనీసం ఒక్క వీకెండ్‌కైనా సినిమా హౌస్ ఫుల్స్ అవుతుంటాయి. కలెక్షన్లు వస్తుంటాయి. కానీ శాకుంతలం విషయంలో అది కూడా జరగడం లేదనిపిస్తుంది.


 



నిన్న శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే సమంత శాకుంతలం పరిస్థితి దారుణంగా ఉందని అర్థం అవుతోంది. ఇక రాష్ట్రమంతటా కూడా అదే ట్రెండ్ ఉన్నట్టు కనిపిస్తోంది. వీకెండ్.. కొత్త సినిమా.. సమంత హీరోయిన్.. అంటే కలెక్షన్లు ఎలా ఉండాలి.. రెండు వారాల క్రితం విడుదలైన దసరా సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.. తమిళ డబ్బింగ్ విడుదల సినిమాకు కూడా కలెక్షన్లు ఎక్కువే ఉన్నాయి.. వాటిలో సగం శాకుంతలం సినిమాకు వచ్చిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


సమంత శాకుంతలం సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువే ఉంది. థియేటర్ నుంచి దాదాపు ఇరవై కోట్ల కలెక్షన్లు వస్తే తప్పా హిట్ అని చెప్పలేం. పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా కనీసం పది కోట్ల షేర్ వస్తుందా? అనేది అనుమానంగా మారింది. ఈ సినిమాతో దిల్ రాజు భారీగానే నష్టపోయేలా కనిపిస్తున్నాడు. గుణ శేఖర్ హిరణ్యకశ్యప కూడా అటకెక్కినట్టే. పూర్ వీఎఫ్‌ఎక్స్, విజువల్స్‌తో శాకుంతలం సినిమా నవ్వులపాలైంది.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook