ChaiSam Divorce: సమంత షాకింగ్ పోస్ట్... ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ వార్నింగ్.. పోస్ట్ వైరల్
సమంత నాగ చైతన్య విడాకుల తరువాత సమంత పెట్టిన ప్రతి పోస్ట్ ను ట్రోల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ట్రోల్స్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ.. ఇన్‌స్టాగగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
ChaiSam Divorce: సమంత నాగచైతన్య (Samantha- Nagachaitanya) విడాకులు విషయంలో అభిమానాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకుల తరువాత సమంత సోషల్ మీడియా అకౌట్ల పై, ఆమె పెట్టే పోస్టులపై జనాలు ఫోకస్ పెడుతున్నారు. సమంత పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నాయి.
సమంత చేసే సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె మానసికంగా ఎంత భాదపడుతుందో తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం సమంత తన ఇన్‌స్టాగగ్రామ్ అకౌంట్ (Samantha Instagram Account) లో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Also Read: Railway Recruitment: రైల్వే శాఖలో 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేయండి ఇలా
"మహిళకు చేసే ప్రతి పని పైన నైతికత గురించి చేర్చించే సమాజాం.. మగాళ్లు చేసే పనులలో నైతికత గురించి ప్రశ్నలు ఎందుకు వేయరు? మన ఉంటున్న సమాజానికే ఏ నైతికత లేదనే చెప్పాలి" అంటూ పోస్ట్ పెట్టింది.
సమంత నాగచైతన్య విడాకుల అనంతరం.. సమంతదే తప్పు అని కొంత మంది ట్రోల్స్ చేస్తుంటే.. మరో కొంత మంది సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ (Preetham Jukalker)వల్లే ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఏ పోస్ట్ పొట్టిన క్షణాల్లో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: CSK Vs PBKS: LIVE మ్యాచ్ లో గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన దీపక్.. హోరెత్తిన స్టేడియం
కానీ సమంత ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. విడాకులు అనేది సమంత నాగ చైతన్య ఇద్దరి వ్యక్తిగతం... అసలు కారణాలు తెలియకుండా ఒక్కరినే విమర్శించటం, ట్రోల్ చేయటం సరి కాదని కొంత మంది అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook