Railway Recruitment: రైల్వే శాఖలో 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేయండి ఇలా

ఇండియన్ సౌత్ వెస్టర్న్ రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, అప్లై చేసి విధానాలు ఇక్కడ తెలుపబడ్డాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 12:53 PM IST
  • నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన సౌత్ వెస్టర్న్ రైల్వే శాఖ
  • 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఇక్కడ తెలుపబడ్డాయి
Railway Recruitment: రైల్వే శాఖలో 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేయండి ఇలా

Railway Recruitment: ఇండియన్ సౌత్ వెస్టర్న్ రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్న రైల్వే శాఖ..  ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. 

దరఖాస్తు చేసుకునే తేదీ ప్రారంభం అవగా.. చివరి తేదీ నవంబర్ 3 అని ప్రకటన చేసింది. దరఖాస్తు ఫీజు రూ. 100 కాగా.. పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసికోవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురం, చిత్తూరు జిల్లాల వాసులు, తమిళనాడుకు చెందిన ధర్మపురి, సేలం, వేలూర్ వాసులు మరియు కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాల వాసులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read: CSK Vs PBKS: LIVE మ్యాచ్ లో గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన దీపక్.. హోరెత్తిన స్టేడియం

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు: 
1) ఫిట్టర్‌ పోస్టులు -390
2) ఎలక్ట్రిషియన్‌ పోస్టులు -248
3) కార్పెంటర్‌ పోస్టులు – 11
4) వెల్డర్‌ పోస్టులు – 55
5) మెషినిస్ట్‌ పోస్టులు – 13
6) టర్నర్‌ పోస్టులు -13 
7) స్టెనోగ్రాఫర్‌ పోస్టులు – 2 
8) పెయింటర్‌ పోస్టులు -18
9) రిఫ్రిజిరేషన్‌ & ఎయిర్‌ కండీషనింగ్‌ మెకానిక్‌ పోస్టులు – 16
10) ప్రోగ్రామింగ్‌ & సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులు – 138 

Also Read: KKR vs RR match highlights: రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. చెలరేగిన Shivam Mavi

ఇతర వివరాలు : 
1) దరఖాస్తు ప్రారంభం తేదీ: 2021 అక్టోబర్ 4 - చివరి తేదీ:  2021 నవంబర్ 3
2) విద్యార్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయి ఉండాలి 
3) వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు.
4) దరఖాస్తు ఫీజు: రూ.100

ఎలా దరఖాస్తు చేసుకోవాలి: 
1) జాబ్ నోటిఫికేషన్ లింక్ - https://www.rrchubli.in/Apprentice%20Notification_compressed.pdf
2) పోస్టులకు దరఖాస్తు లింక్- https://jobs.rrchubli.in/ActApprentice2021-22/
3) ముందుగా అభ్యర్థులు https://jobs.rrchubli.in/ActApprentice2021-22/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి 

Also Read: Longest anaconda goods train video: అనకొండ లాంటి 2.4 కి.మీ పొడవైన రైలు ఎప్పుడైనా చూశారా ? ఇదిగో వీడియో

4) హోమ్ పేజీ ఓపెన్ అయిన తరువాత New Registration పైన క్లిక్ చేయండి 
5) అడిగిన వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి 
6) సంతకం, ఫోటో వంటి అవసరమైన వివరాలను అప్ లోడ్ చేయండి 
7) దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫామ్ సబ్మిట్ చేయండి 
8) మీ దరఖాస్తు సబ్మిట్ చేసిన తరువాత, అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవటం మరవకండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News