Samantha Tops in Pan India heroines list Again: టాప్ హీరోలు, హీరోయిన్ల జాబితాని ప్రతినెలా విడుదల చేస్తూ వస్తున్న ఆర్ మాక్స్ మీడియా సంస్థ మార్చి 2023వ సంవత్సరానికి గాను పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ జాబితాని తాజాగా ప్రచురించింది. ఈ జాబితాలో ఎప్పటిలాగే సమంతా రూత్ ప్రభు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తెలుగు సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకున్న ఈ భామ తమిళంలో కూడా మంచి సినిమాలే చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో ఆమె చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ జాబితాలో బాలీవుడ్ భామ అలియా భట్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే దీపికా పదుకొనే మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే తమిళ, తెలుగు, సినిమాల్లో సత్తా చాటింది. ఇప్పుడు జవాన్ లాంటి సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాంటి ఆమె నాలుగో స్థానాన్ని దక్కించుకోగా ఈ మధ్యనే ఒక పిల్లాడికి జన్మనిచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న కాజల్ అగర్వాల్ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.


Also Read: Virupaksha Collections: 'విరూపాక్ష'కి ఊహించని షాక్.. సూపర్ హిట్ టాక్ తో కూడా డిజాస్టర్ సినిమా కలెక్షన్స్ దాటలేక పోయిందిగా!


ఇక చేసింది తక్కువ సినిమాలే అయినా నేషనల్ స్థాయిలో నేషనల్ క్రష్ అని పేరు తెచ్చుకున్న రష్మిక మందన ఈ జాబితాలో ఆరో స్థానం దక్కించుకుంది. ఇక సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ తరగని అందంతో ప్రేక్షకులను చేస్తున్న త్రిష ఏడవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక బాలీవుడ్ సహా దక్షిణాది సినిమాల్లో మెరుస్తున్న కియార అద్వానీ ఈ జాబితాలో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకోగా సౌత్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి ఈ జాబితాలో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకుంది.


ప్రస్తుతానికి ఆమె చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా పాన్ ఇండియా హీరోయిన్లలో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. ఇక ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ జాబితా విషయానికి వస్తే బాలీవుడ్ నుంచి నలుగురు హీరోయిన్లు ఉండగా సౌత్ నుంచి ఆరుగురు భామలు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమను బేస్ చేసుకుని సమంత, కాజల్ అగర్వాల్, రష్మిక మందన, అనుష్క శెట్టి వండేవారు నలుగురు ఉండగా మిగతా ముగ్గురు తమిళ సినీ పరిశ్రమను బేస్ చేసుకున్న వారే ఉండడం గమనార్హం. 


Also Read: Shaakuntalam Vs Virupaksha: సమంత 'శాకుంతలం'కి దెబ్బ మీద దెబ్బ.. ఒక్కరోజులోనే విరూపాక్ష బ్రేక్ చేసేసిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook