Samantha Prays Palani Murugan: సమంత రూత్ ప్రభు విడాకులు తీసుకున్న తర్వాత నుంచి ప్రతి చిన్న విషయంలోనూ హైలైట్ అవుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా, అది మీడియాలో సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఇక ఈ మధ్యకాలంలోనే తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్న ఆమె తాజాగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతవరకూ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి వెళ్ళింది.  తమిళనాడులోని ప్రజలందరూ పళని మురుగన్ ను కొంగుబంగారంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన దగ్గర మొక్కుకున్న ఏ మొక్కైనా, వెంటనే తీర్చేస్తాడని అక్కడి వారందరూ నమ్ముతూ ఉంటారు. అయితే సమంత ఏం మొక్కుకుందో తెలియదు గానీ ఆలయంలో ఉన్న 600 మెట్లు ఎక్కుతూ ప్రతి మెట్టుకు కర్పూరంతో హారతి వెలిగించింది. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేవించింది.  


ఆమె వెంట దర్శకుడు ప్రేమ్ కుమార్ తో పాటు మరికొంతమంది తమిళ నటీమనులు ఉన్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉంది, అయితే ఆ సినిమాను అనేక కారణాలతో వాయిదా వేశారు. ఇ ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సినిమా యూనిట్ ప్రకటించింది.


ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ఎందుకు వాయిదా పడిందా అనే విషయం మీద చర్చ జరుగుతుంది. మరోపక్క సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. సమంత కారణంగానే ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే సమంత షూటింగ్ కి హాజరైతే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై విడుదలకు సిద్ధం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సినిమా షూటింగ్ ఎగ్గొట్టిన సమంత ఆ మధ్య ముంబై వెళ్లి సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంది.


Also Read: OTT movies this week: ఒటీటీలో సందడి చేయబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలివే!


Also Read: Bandla Ganesh Tweets: మీరు వండర్ ఫుల్, మీరే ఇండియా ఫ్యూచర్ కేసీఆర్.. బండ్లన్న ట్వీట్ల వర్షం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook