Sameera Reddy First Day shoot సమీరా రెడ్డి తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. అందరి దృష్టిలో పడింది. ఎందుకంటే ఆమె పెద్ద పెద్ద హీరోలకే భారీ డిజాస్టర్లను ఇచ్చింది. అందుకే అలా అందరికీ గుర్తుండిపోయింది. మెగాస్టార్ చిరంజీవి వంటి వాడికి కూడా డిజాస్టర్‌ను ఇచ్చిందనే టాక్ అప్పట్లో వైరల్ అయింది. ఎన్టీఆర్‌ నటించిన అశోక్, నరసింహుడు ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జై చిరంజీవి సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అలా సమీరా రెడ్డి నటించిన సినిమాలు అందరికీ గుర్తుండిపోయాయి. ఇప్పుడు సమీరా రెడ్డి తన తొలి అనుభవం గురించి చెప్పుకొచ్చింది. 1998లో నా మొదటి ఆడిషన్ జరిగింది.. మహేష్‌ బాబుతో చేయాల్సి సినిమా కోసం ఈ ఆడిషన్ జరిగింది.. నేను అప్పుడు పిచ్చి భయంతో ఉన్నాను.. నేను నటించలేకపోయాను..దెబ్బకు ఏడుస్తూ ఇంటికి పారిపోయాను.. ఇక మనకు డెస్క్ జాబే కరెక్ట్ అనుకుని రెండేళ్లు అదే పని చేశాను.. ఆ తరువాత ధైర్యం తెచ్చుకుని మళ్లీ అహిస్తా కిజియే బాతెన్ అనే మ్యూజిక్ వీడియోతో కెరీర్ ప్రారంభించాను అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.


ఇక ఆ సమయంలో చేసిన ఫోటో షూట్లు, దిగిన ఫోటోలను ఇప్పుడు షేర్ చేసింది సమీరా రెడ్డి. ఇందులో సమీరా రెడ్డి ఎంతో అమాయకంగా కనిపిస్తోంది. ఇక 1998లో అంటే.. అది రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయం. అంటే రాజకుమారుడు సినిమాలో ముందుగా సమీరా రెడ్డిని తీసుకోవాలని ప్లాన్ చేసినట్టున్నారు. కానీ చివరకు ప్రీతి జింటా సెట్స్ మీదకు వచ్చినట్టుంది.


సమీరా రెడ్డి ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటోంది. భర్త, పిల్లల ఫోటోలను సమీరా రెడ్డి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే సమీరా రెడ్డి తరుచుగా బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటూ ఉంటుంది.


Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?


Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి