Sampoornesh Babu Golden offer to Pulsar Bike Dancer Gajuwaka Conducter Jhansi: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పల్సర్ బైక్ సాంగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక జానపద గాయకుడు రమణ రాసుకున్న ఈ పాట సోషల్ మీడియాలోకి ఎక్కి ప్రపంచమంతా చుట్టేసింది. ఇక ఇదే పాటకు విశాఖపట్నం గాజువాక బస్ డిపోకు చెందిన కండక్టర్ ఝాన్సీ అండ్ టీం అనేక జాతర్లలో, ఈవెంట్లలో ప్రదర్శిస్తూ మంచి క్రేజ్ సంపాదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వారికి లభించిన క్రేజ్ చూసిన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ మల్లెమాల యాజమాన్యం వెంటనే ఝాన్సీ అండ్ టీంని తీసుకొచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ లో డాన్స్ చేయించింది. ఇక ఈ దెబ్బతో ఝాన్సీ అండ్ టీం ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ ఒక్క పాటే కాక వారు గతంలో ఎన్ని డాన్స్ షోలలో పాల్గొన్నారు? ఆ వివరాలు ఏమిటి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇంత టాలెంటెడ్ డాన్సర్ కి ఇప్పటివరకు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ఆఫర్ రాకపోవడం అనేది ఆసక్తికరమైన అంశమే.


ఇప్పుడు తాజాగా హీరో సంపూర్ణేష్ బాబు ఝాన్సీ అండ్ టీంకి ఒక ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. తన సినిమాలో ఝాన్సీ లీడ్ గా ఒక ఐటెం సాంగ్ చేయవలసిందిగా ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఝాన్సీ అండ్ టీం అందుకు ఒప్పుకున్నారని త్వరలోనే ఈ ఐటెం సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.


ఎలా అయినా సినిమాలలో ఒకచోట డాన్సర్ గా అయినా కనిపించాలని తన కోరిక అని ఝాన్సీ పలు సందర్భాల్లో పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించింది. ఇప్పుడు ఆమె కోరిక తీరడమే కాదు ఏకంగా ఒక ఐటెం సాంగ్ లో లీడ్ గా డాన్స్ చేసే అవకాశం దొరకడం అనేది లక్ అనే చెప్పాలి . మె కష్టంతో లక్ కలిసి రావడంతో ఆమె సంపూర్ణేష్ బాబు సినిమాలో నర్తించనుంది. 


Also Read: Varun Tej as Abhinandan Varthaman: అభినందన్ పాత్రలో వరుణ్ తేజ్.. పాన్ ఇండియా లెవల్లో మూవీ!


Also Read: Konidela Productions Trolled : లిరికల్ వీడియోనే రిలీజ్ చేయలేక పోయారు.. ఇక సినిమానేం రిలీజ్ చేస్తారు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి