బాలీవుడ్ నటి సనా ఖాన్ ( Sana Khan ) తను సినిమా ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నట్టు ప్రకటించింది. బిగ్ బాస్ 6తో పాటు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) హీరోగా వచ్చిన జైహో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సనా ఖాన్ షోబిజ్ నుంచి పూర్తిగా దూరం బయటికి రానున్నట్టు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?


చిత్రపరిశ్రమ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సనా ఖాన్ తన సోషల్ మీడియా ( Social Media ) ఎకౌంట్స్ నుంచి సినిమా ప్రపంచం తాలుకూ కంటెంట్ పూర్తిగా తొలగించింది. భగవంతుని ఆదేశాల ప్రకారం మానవసేవ చేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపింది సనా.


తన సోషల్ మీడియా ఖాతాలో ఉన్న 102 పోస్టులను తొలగించింది సనా ఖాన్. ఇందులో 2016 నుంచి పోస్ట్ చేసిన కంటెంట్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ( Instagram ) ఆమెకు 3.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 



ALSO READ|  Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు


సినీ పరిశ్రమ తనకు గుర్తింపుతో పాటు డబ్బు, గౌరవాన్ని ఇచ్చింది అని.. కానీ ఇటీవలే తనుకు ఆత్మసాక్షాత్కారం కలిగింది అని .. డబ్బు, కీర్తికోసం మాత్రమే పనిచేయడం మనిషి జీవితానికి లక్ష్యం కాదు అని...అందుకే ఇకపై ఆధ్యాత్మిక, మానవ సేవలో జీవితం గుడుపుతాను అని తెలిపింది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR