Animal trailer : తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇక అర్జున్ రెడ్డి తరువాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగి మన తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తారు అనుకుంటే.. తన తదుపరి సినిమా ఏకంగా బాలీవుడ్ లో చేసి అందరికీ షాక్ ఇచ్చారు. తనకు సూపర్ సక్సెస్ ఇచ్చిన అర్జున్ రెడ్డి సినిమా నే హిందీలో కబీర్ సింగ్ గా చేసి అక్కడ కూడా విజయం సాధించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కబీర్ సింగ్ సినిమా తర్వాత ఇప్పుడు ఏకంగా లవర్ బాయ్ రణబీర్ కపూర్ ని అగ్రెసివ్ హీరోగా చూపిస్తూ యనిమల్ సినిమాతో తెలుగు హిందీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైపోయాడు. ఈ సినిమా మొదటి లుక్ బయటకి వచ్చిన దగ్గర నుంచే ఈ చిత్రం పక్కా మరోసారి సందీప్ రెడ్డి మార్క్ చూపిస్తుందని అర్థమయిపోయింది.


అర్జున్ రెడ్డి సినిమా తోనే సందీప్ రెడ్డివంగా తాను హీరోని చాలా అగ్రెసివ్ గా.. వైలెంట్ గా.. చూపిస్తారు అని చెప్పకనే చెప్పాడు. సింపుల్ గా చెప్పాలి అంటే సందీప్ రెడ్డి.. హీరో అంటే దేనికైనా తెగించేవాడు.. అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రీతి కోసం అర్జున్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తాడు.. ఏదైనా చేసేస్తాడు.. అలానే ఆ సినిమాని మొత్తం లాగారు ఈ డైరెక్టర్. ఇక ఈరోజు విడుదలైన యానిమల్ ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాలో తన ప్రియురాలి కోసం కాదు కానీ తన తండ్రి కోసం ఏదైనా చేసే పాత్రలో తన హీరోని చూపించారు సందీప్.



బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ చూస్తే.. మొదటి నుంచి చివరి వరకు హీరో తన తండ్రి కోసం ఏదో ఒకటి చేయడమే చూపిస్తూ వచ్చాడు.. అయితే తనకు తన తండ్రి పైన ఉండేది ప్రేమ కాదు ఏదో ఒక రోగం అంటూ రష్మిక చెప్పిన డైలాగ్.. ఆ ట్రైలర్ చూశాక మనకు నిజమే అనిపిస్తుంది. మొత్తానికి మరోసారి ఈ సినిమాతో సందీప్ తన మార్కుని చూపీబోతున్నారు అని అయితే అర్థమైంది.


ఇక రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమా ర‌న్ టైమ్ విషయానికి వస్తే 3 గంట‌ల 21 నిమిషాల 23 సెక‌న్లు అంటూ ద‌ర్శ‌కుడు తెలియ‌జేశారు. మరి ఇంతసేపు తన మార్కుతో సందీప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి.


Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  


 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook