Allu Arjun: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.. స్పందించిన హీరో టీమ్
Pushpa 2 premiere controversy: పుష్ప సినిమా ప్రీమియర్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టికెట్ రేట్స్ విపరీతంగా పెంచినా కానీ.. హాట్ కేకు లాగా అమ్ముడుపోయాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్ సైతం వచ్చి ఈ ప్రీమియర్ చూశారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక దుర్ఘటన చోటుచేసుకుని అందరినీ షాక్ కి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Case On Allu Arjun: సాధారణంగా ఏం హీరో అయినా సరే తన సినిమా విడుదలైన తర్వాత అభిమానులతో కలిసి తన సినిమాను థియేటర్లలో నేరుగా చూడాలని.. కోరుకుంటారు. అయితే ఇలా చూడడం తప్పులేదు కానీ అభిమానుల భద్రత చాలా ముఖ్యం అనే చెప్పాలి. ముఖ్యంగా హీరోలు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల అభిమానులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు పైగా ఎంతో నష్టం కూడా.
ముఖ్యంగా తమ అభిమాన హీరో థియేటర్ కి వస్తున్నాడు అంటే అభిమానులు సైతం వారిని చూడడానికి ఎగబడతారు ఇలా ఎగబడే సమయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా పుష్ప -2.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇకపోతే ఇదిలా ఉండగా రాత్రి నుంచి బెనిఫిట్ షోలు మొదలవగా షో చూడడానికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉండగా హైదరాబాదులో సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ కూడా సినిమా చూడడానికి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తమ అభిమాన హీరోని చూడాలనుకున్న అభిమానుల మధ్య పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే 39 సంవత్సరాల వయసున్న రేవతి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించింది. ఆమె కొడుకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే యువతి మరణించింది. దీనికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఆ రాత్రి పూట రావాల్సిన అవసరం ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు ఆయనను అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కూడా కోరారు.
అయితే దీనిపై స్పందించిన అల్లు అర్జున్ టీం బాధిత యువతి కుటుంబానికి కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు
Also Read: Padi Kaushik Reddy: మళ్లీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉగ్రరూపం.. బంజారాహిల్స్ సీఐతో రచ్చరచ్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.