Sanjjanaa Galrani Mani Shankar Movie : చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన సంజన గల్రానీ.. అవి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Sanjjanaa Galrani Latest Pics సంజనా గల్రానీ చాలా రోజుల తరువాత బయటకు వచ్చింది. కరోనా సమయంలో ఆమె ఎన్ని చిక్కుల్లో పడిందో అందరికీ తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఆమె ఎన్ని వివాదాల్లో నలిగిపోయిందో అందరికీ తెలిసిందే.
Sanjjanaa Galrani Mani Shankar Movie : సంజనా గల్రానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌ను మెప్పించింది. అయితే సంజనా గల్రానీ మధ్యలో తెలుగు సినిమాకు దూరంగానే ఉంటూ వచ్చింది. సంజనా గల్రానీ రెండు మూడేళ్ల క్రితం డ్రగ్స్ కేసులో ఎక్కవగా వైరల్ అయింది. మళ్లీ ఇన్ని రోజుల తరువాత సంజనా మీడియా ముందుకు వచ్చింది. తన కొత్త సినిమా మణిశంకర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. తనకు ఎలాంటి సమయంలో ఈ మూవీ ఆఫర్ వచ్చిందో చెబుతూ ఎమోషనల్ అయింది.
శివ కంఠమనేని హీరోగా రాబోతోన్న మణిశంకర్ సినిమాలో సంజనా గల్రానీ నటించింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందట. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) నిర్వహించారు. అయితే తాజాగా చిత్రయూనిట్ అంతా కూడా మీడియా ముందుకు వచ్చింది.
సినిమా అద్భుతంగా వచ్చిందని, ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు పరిగెడుతూనే ఉంటుందని హీరో, దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది అని శివ కంఠమనేని అన్నారు. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించామని తెలిపారు. పాటలు, ఫైట్స్ కూడా కథలో భాగంగానే వస్తాయి. రెండు గంటలు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని దర్శకుడు జీవీకే తెలిపారు. ఇక హీరోయిన్ సంజనా గల్రానీ తనకు ఎలాంటి సమయంలో ఈ ఆఫర్ వచ్చిందో చెప్పుకొచ్చింది.
బాగున్నప్పుడు అందరూ మాట్లాడతారు.. కానీ కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోరని వాపోయింది. అలాంటి సమయంలోనే నాకు చేయూతలా ఈ మణిశంకర్ సినిమా వచ్చిందని సంజనా చెప్పుకొచ్చింది. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్ అని, నిర్మాతలు చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారని తెలిపింది. సినిమా నచ్చితే అందరూ సపోర్ట్ చేయండని కోరింది.
Also Read : RRR Oscar Awards : ఆస్కార్ అవార్డు ఇవ్వడం లేదా? కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారా?.. రాజమౌళి మామూలోడు కాదు
Also Read : Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్ బాబు తొలి పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook