53rd IFFI Event-Sankarabharanam Movie : కళాతపస్వీ కే విశ్వనాథ్ తీసిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే. కళాతపస్వీగా విశ్వనాథ్ తెలుగు తెరపై తన ముద్ర వేశాడు. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం విశ్వనాథ్ కీర్తి అజరామరంగానే ఉంటుంది. కే విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా అయితే అద్భుత కళాఖండమే. ఆ సినిమా నేపథ్యం, సంగీతం, పాటలు, నటీనటుల పర్పామెన్స్ ఇలా అన్ని రకాలుగా శంకరాభరణం సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది. అలాంటి ఈ చిత్రానికి ఇప్పుడు దేశస్థాయిలో గుర్తింపు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవాలో జరిగే 53వ IFFI - 2022 ఈవెంట్లో  శంకరాభరణం చిత్రాన్ని రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్స్ విభాగంలో ఎంపిక చేశారట. జాతియ చలనచిత్ర ఆర్కైవ్స్ వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి , భద్ర పరిచే కార్యక్రమంలొ భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన శంకరాభరణం చిత్రాన్ని ఎంచుకున్నారు. వాటిని ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. తెలుగు నుంచి ఈ విభాగంలోకి ఎంపికైన ఏకైక చిత్రం ఇదే.


పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ,ఏడిద నాగేశ్వరావు నిర్మించిన శంకరాభరణం 80వ దశకంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. మాస్ సినిమాలు ఊపందుకుంటున్న 80వ దశకంలో.. ఈ సినిమాకు కలెక్షన్లు రావు.. ఫ్లాప్ అవుతుందని అంతా అన్నా కూడా దర్శక నిర్మాతలు మాత్రం ధైర్యం చేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం సినిమాకు నీరాజనాలు పట్టారు. ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్‌గా నిలబెట్టేశారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు మరోసారి గోవాలో ప్రదర్శితం కాబోతోంది. ఈ చిత్రానికి నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా  ప్రత్యేక  ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.


Also Read : Mahesh Babu : గంగానదిలో అమ్మ అస్థికలు.. కృష్ణానదిలో నాన్న అస్థికలు.. పుట్టెడు దుఃఖంలో మహేష్‌ బాబు


Also Read : Chiranjeevi IFFI Award : ధర్మం తెలిసిన ధర్మాత్ముడు.. చిరంజీవిపై బండ్ల గణేష్.. ప్రధాని ట్వీట్ వైరల్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook