Waltair Veerayya Vs Veera Simha Reddy : సంక్రాంతి బాక్సాఫీస్ లెక్కలు.. ఎన్ని కోట్ల వ్యాపారం అంటే?
Tollywood Box Office Target టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దాదాపు రెండొందల కోట్ల వ్యాపారం ఈ సంక్రాంతికి జరిగినట్టు కనిపిస్తోంది. అదే చిరు, బాలయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే.. లాభాలు మాత్రం ఓ రేంజ్లో ఉండబోతోన్నాయి.
Sankranthi 2023 Tollywood Box Office సంక్రాంతికి సినిమాల సందడి అనేది కామన్. ప్రతీ ఏడాది పెద్ద హీరోల సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. అయితే ఈ సారి చిరంజీవి, బాలయ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా రెడీ అయ్యారు. ఆ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీనే. రెండింటిలో శ్రుతి హాసన్ హీరోయిన్. ఇలా కొన్ని కామన్ అంశాలున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలతో పాటుగా తమిళ సినిమాలు కూడా డబ్బింగ్ రూపంలో వచ్చాయి. ఈ రోజు అజిత్ తెగింపు అంటూ వచ్చాడు. ఈ సినిమాకు తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది.
రేపు బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా రాబోతోంది. ఆ మరుసటి రోజు చిరంజీవి వాల్తేరు వీరయ్య రానుంది. ఇక చివరగా విజయ్ వారసుడు, సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం అనే సినిమాలు రాబోతోన్నాయి. అయితే వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాల్తేరు వీరయ్య ఎక్కువగా బిజినెస్ చేసింది. ఆ తరువాత బాలయ్య సినిమా ఉంది. వారసుడు, తెగింపు సినిమాలకు అంతగా బిజినెస్ జరగలేదు. అయితే డబ్బింగ్ సినిమాలకు ఎప్పుడూ జరిగే బిజినెస్ ఇప్పుడు కూడా జరిగినట్టు కనిపిస్తోంది.
చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 89 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగబోతోంది. బాలయ్య వీర సింహా రెడ్డి అయితే 74 కోట్ల టార్గెట్‌తో రాబోతోంది. అజిత్ మూడున్నర, కళ్యాణం కమనీయం మూడు కోట్లు, వారసుడు పదిహేను కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగబోతోన్నాయి. అలా మొత్తంగా ఈ ఐదు సినిమాలు కలిపి 185 కోట్ల టార్గెట్‌తో వ్యాపారం జరిగింది.
అయితే ఈ సినిమాల్లో చిరు, బాలయ్యలకు మాత్రం రికార్డ్ కలెక్షన్లు వచ్చే చాన్సులున్నాయి. ఈ రెండు సినిమాలకు పాజిటిట్ టాక్ వస్తే మాత్రం.. ఇంచు మించు మూడొందల కోట్ల వరకు వ్యాపారం జరిగే చాన్స్ ఉంది. మరి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ లెక్కలు ఇండస్ట్రీకి శుభ పరిణామంగా ఉంటాయా? లేదా? అన్నది చూడాలి. ఈ సంక్రాంతి బాగుంటే.. మున్ముందు మరింత ఊపుతో సినిమాలు లైన్‌లోకి వచ్చేస్తాయి.
Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి