Sarkaru Vaari Paata First Review: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” (Sarkaru Vaari Paata). ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthy  Suresh) నటిస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో...ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. ఇక ప్రధాన నటులు మహేశ్ బాబు, కీర్తి సురేష్‌లకు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబుకు నెగెటివ్ వచ్చినప్పటికీ కీర్తి మాత్రం ఐసోలేషన్‌లోనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు  'సర్కారు వారి పాట' మూవీపై ఫస్ట్ రివ్యూ (Sarkaru Vaari Paata First Review) ఇచ్చారు. ''తాను ఒక మింట్  రష్ ప్రింట్ చూశానని...సినిమా మైండ్ బ్లోయింగ్'' గా ఉందని ఆయన వెల్లడించారు. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఉమైర్ సంధు (Umair Sandhu) పేర్కొన్నారు. 


Also Read: Sonal Chauhan : నాగార్జున చిత్రంలో బాలయ్య హీరోయిన్


ఈ చిత్రంలోని మెుదటి పాటను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు మూవీ మేకర్స్. అయితే కొవిడ్ కారణంగా దానిని వాయిదా వేశారు. ఈ సినిమా ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల కానుంది. అయితే కరోనా ఉద్ధృతి కారణంగా సర్కారు వారి పాట చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook