Sarkaru Vaari Paata update: సర్కారు వారి పాట ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చిన తమన్
Sarkaru Vaari Paata update: సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో మహేశ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మహేశ్ ఫస్ట్ సాంగ్ కూడా అంతే స్టైలిష్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
Sarkaru Vaari Paata update First single from Superstar Mahesh Babus movie may out this Deepavali thaman tune goes viral: పరశురాం (Parashuram) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, (Mahesh Babu) కీర్తి సురేష్ జంటగా తెరకెకుతున్న మూవీ.. సర్కారు వారి పాట. ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో మహేశ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మహేశ్ ఫస్ట్ సాంగ్ కూడా అంతే స్టైలిష్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. థమన్ (Thaman) కంపోజ్ చేసిన ట్యూన్ వింటే ఈ విషయం తెలిసిపోతుంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో (Spain) జరుగుతోంది. మహేశ్, కీర్తి సురేశ్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, సాంగ్‌ను పూర్తి చేస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా సర్కారు వారి పాట మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని టాక్. అందుకు సంబంధించిన ట్యూన్‌నే (Tune) తాజాగా థమన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్యూన్ బాగా వైరల్ అవుతోంది.
Also Read : Chiranjeevi: దీపావళిరోజున మెగాస్టార్ కొత్త చిత్రం షూటింగ్
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ బార్సిలోనాలో
(Barcelona) చిత్రీకరిస్తున్నట్లు తాజగా చిత్ర యూనిట్ తెలిపింది. మైండ్ బ్లోయింగ్ లోకేషన్లలో మహేష్ బాబు (Mahesh Babu) కీర్తి సురేష్‌లపై డ్యూయట్స్, లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
Also Read : Varudu Kavalenu trailer: ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి