Jathara Movie Trailer Updates: థియేటర్లలో సందడి చేసేందుకు జాతర మూవీ సిద్ధమైంది. నవంబర్ 8న ఆడియన్స్‌ అలరించేందుకు వస్తోంది. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ.. దర్శకత్వం వహించారు. మూవీటెక్ ఎల్‌ఎల్‌సీతో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌తో మేకర్స్ రూపొందించారు. చిత్తూరు జిల్లాలో జాతర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆడియన్స్‌కు మాస్ జాతరలో ట్రైలర్‌ను కట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Muhurat Diwali Pick 2024: దీపావళి ముహూరత్ ట్రేడింగ్ కోసం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసిన టాప్ 7 స్టాక్స్ ఇవే..40 శాతం అప్ సైడ్ ఉండే ఛాన్స్   


‘గుడికి మైలు అంటుకుందని.. ఆ అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో’ అంటూ దండోరాతో ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్‌ను మొదలుపెట్టారు. 'ఈ ఇంటికి.. అమ్మోరు తల్లికి రుణం తీరిపోయిందిరా..' 'నువ్వు ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోవడానికి అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావారా..?', 'మేం తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకుని బతికే వాళ్లం కాదు' 'ఏ తల్లి అయినా తన బిడ్డ కష్టాల్లో ఉంటే చూసుకుంటు ఉరుకుంటుందా..?' వంటి డైలాగ్స్ ట్రైలర్‌లో అదిరిపోయాయి. ఆర్ఆర్, విజువల్స్, యాక్షన్స్ సీక్వెన్స్ అన్ని ఓ రేంజ్‌లో తీశారు. ట్రైలర్‌లో చివరి షాట్‌తో ఆడియన్స్‌కు గూస్ బంప్స్ పక్కా అని చెప్పొచ్చు.


ఈ మూవీలో దీయా రాజ్ హీరోయిన్‌గా నటించింది. ఆర్.కె.నాయుడు, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ ఇతర పాత్రలు పోషించారు. కె.వి.ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. శ్రీజిత్ ఎడవణ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. గల్లా మంజునాథ్ సమర్పిస్తున్నారు.



సాంకేతిక బృందం:
==> సమర్పణ : గల్లా మంజునాథ్
==> ప్రొడ్యూసర్స్ : రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి
==> బ్యానర్లు : రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ, మూవీటెక్ LLC
==> రచన, దర్శకత్వం : సతీష్ బాబు రాటకొండ 
==> కెమెరామెన్ : కె.వి.ప్రసాద్
==> మ్యూజిక్ : శ్రీజిత్ ఎడవణ
==> PRO : సాయి సతీష్


Also Read: KTR Celebrations: దీపావళి వేళ సంబరాలకు కేటీఆర్ పిలుపు.. ఎందుకు? ఏం సాధించారో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి