Jathara Movie Release Date: కథ డిఫరెంట్‌గా ఉండి.. పర్ఫెక్ట్‌గా మేకింగ్‌ ఉంటే ఆడియన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా కాన్సెప్ట్ బాగుంటునే ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త తరం హవా నడుస్తోంది. మల్టీటాలెంట్‌తో మేకింగ్, టేకింగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. సతీష్ బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో జాతర మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 8న ఈ సినిమా థియేటర్లలో సందడి మొదలుపెట్టనుంది. మూవీటెక్ ఎల్‌ఎల్‌సీతో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Urvashi Rautela: ఏజ్ లో పెద్దవారితో కూడా ఆ పని చేస్తా.. బాంబు పేల్చిన బాలయ్య  భామ..స్టోరీ ఏంటంటే..?  


ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇంటెన్స్ డ్రామాతో జాతర మూవీ రానుంది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో రూపొందించారు. జాతర నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం చెబుతోంది. పాలేటి గంగమ్మ దేవత బ్యాక్ డ్రాప్‌గా డైరెక్టర్ కథ రాసుకున్నారు. ఈ మూవీలో దీయా రాజ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కేవీ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. 


జాతర ఫస్ట్ లుక్ పోస్టర్‌ విషయానికి వస్తే.. సతీష్ బాబు రా అండ్ రస్టిక్‌గా కనిపించబోతున్నారు.  శత్రువుల్ని మట్టుపెట్టేందుకు కత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నట్లు ఉంది. అమ్మవారి ఫోటోతోపాటు జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్ ఉండడంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ‘దేవుడు ఆడే జగన్నాటకంలో.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం’ అంటూ ఆసక్తికర డైలాగ్‌ను పోస్టర్‌పై వదిలారు. 


సాంకేతిక బృందం:


==> సమర్పణ : గల్లా మంజునాథ్
==> ప్రొడ్యూసర్స్ : రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి
==> బ్యానర్లు : రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ, మూవీటెక్ LLC
==> రైటింగ్, డైరెక్షన్ : సతీష్ బాబు రాటకొండ 
==> కెమెరామెన్ : కేవీ ప్రసాద్
==> మ్యూజిక్ : శ్రీజిత్ ఎడవణ
==> PRO : సాయి సతీష్


Also Read: YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిల


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.