Satish Kaushik Death: నటుడు సతీష్ కౌషిక్ మృతిపై అనుమానాలు..ఆ మందులు వాడడం వల్లేనా?
Satish Kaushik Death Case : నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మార్చి 9న 66 ఏళ్ల వయసులో మరణించగా ఆయన గుండెపోటుతో చనిపోయినా ఇంకేమైనా కారణాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
Satish Kaushik Death Case Update: నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మార్చి 9న 66 ఏళ్ల వయసులో మరణించారన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సతీష్ కౌశిక్ మృతి గుండెపోటు కారణంగా చనిపోయాడని చెబుతున్నా పోస్ట్‌మార్టం నివేదికలో కూడా అతని మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని పేర్కొనబడింది, అయితే ఇప్పుడు ఈ విషయంలో పెద్ద షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ కౌశిక్ మరణం తర్వాత ఫామ్‌హౌస్‌లో విచారణలో అక్కడ నుంచి కొన్ని ‘మందులు’ దొరికాయి. అంతేకాక వాటితో పాటు, పోస్ట్‌మార్టం నివేదికలో ఆయనకు రక్తపోటు ఉందని, షుగర్ కూడా ఉందని అంటున్నారు. ఇక విస్కారా రిపోర్టు రావాల్సి ఉండగా విస్కారా రిపోర్టు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. సతీష్ కౌశిక్ ఏం తిన్నాడో ఆ తర్వాతే తెలుస్తుందని అంటున్నారు. ఇక సతీష్ కౌశిక్ ఉన్న ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి 20 నుంచి 25 మంది హాజరయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇక సతీష్ వచ్చినప్పటి నుంచి ఉన్న దాదాపు 7 గంటల ఫారం హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసుల చేతిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అంటున్నారు. సతీష్ కౌశిక్ మరణం తరువాత, పోలీసు క్రైమ్ టీమ్ సహా ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తోంది. ఫామ్‌హౌస్‌లో దొరికిన మందులను విచారణకు పంపామని, వాటి నివేదిక రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ దొరికిన మందుల్లో ఎలాంటి నిషేధిత ఔషధం కనుగొనబడలేదు కానీ దొరికిన మందుల్లో ఏయే లవణాలు ఉన్నాయి అనే విషయం ఆరా తీస్తున్నారు.
సతీష్ కౌశిక్ గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినప్పటికీ తుది నివేదిక రావడానికి సమయం పట్టనుందని అంటున్నారు. పోలీసులు సతీష్ కౌశిక్ అవయవాలను భద్రంగా ఉంచి, పోలీసు రక్త నమూనాలు తీసుకున్నారు. సతీష్ కౌశిక్ ఫామ్‌హౌస్‌లోని మొదటి అంతస్తులో ఉండి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు ఇప్పటి వరకు జరిగిన విచారణలో వెల్లడైంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రిలో 66 ఏళ్ల సతీష్ కౌశిక్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగింది అయితే ఆయన గుండెపోటుతో మరణించాడు. అయినా ఫోర్టిస్‌లోని వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కారణంగా పోస్ట్‌మార్టం నిర్వహించబడింది.
Also Read: Balakrishna Hinted on Rana Naidu: బాలయ్య ముందే చెప్పాడు బట్టలిప్పేశారని.. మనమే గుర్తుపట్టలేదు!
Also Read: Umair Sandhu on Pawan Kalyan: పవన్ పెద్ద ఉమనైజర్..ఆ టాప్ హీరోయిన్లతో అలా దొరికేసి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి