Umair Sandhu on Pawan Kalyan: పవన్ పెద్ద ఉమనైజర్..ఆ టాప్ హీరోయిన్లతో అలా దొరికేసి!

Umair Sandhu Tweet on Pawan Kalyan: స్వయం ప్రకటిత దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 11, 2023, 05:34 PM IST
Umair Sandhu on Pawan Kalyan: పవన్ పెద్ద ఉమనైజర్..ఆ టాప్ హీరోయిన్లతో అలా దొరికేసి!

Umair Sandhu Sensational Tweet on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే ఉన్నప్పుడు ఆయన పెళ్లిళ్ల గురించి పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ 2014లో జనసేన అనే ఒక పార్టీ స్థాపించి తెలుగుదేశం బిజెపి పొత్తులో ఉంటే ఆ కూటమికి ఆయన మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం కూటానికి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి వైసీపీకి ప్రధాన శత్రువుగా మారిపోయారు.

దీంతో పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి ఆరోపణలు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయనను ఒక ప్యాకేజ్ స్టార్ అనే ముద్ర వేసే పరిస్థితి కనిపించింది. అయితే ఆయన ప్యాకేజీ తీసుకున్నాడు అనే విషయాన్ని సైంటిఫికల్ గా లీగల్ గా ప్రూవ్ చేయవచ్చు. కానీ ఆ విషయం జోలికి పోకుండా కేవలం ఆరోపణలకే వైసీపీ పరిమితమైంది. అంతేకాక ఆయన పర్సనల్ విషయాలని లాగుతూ పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటూ స్వయంగా వైసీపీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో వైసీపీకి మద్దతుగా మాట్లాడే వారు తప్ప మిగతా ఎవరూ పవన్ పెళ్లిళ్ల గురించి కామెంట్లు చేయలేదు. కానీ ఇప్పుడు స్వయం ప్రకటిత దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందూ ఈ విషయం మీద కామెంట్లు చేశారు. ఈయన  అంటే సాధారణ ప్రజానీకానికి తెలియకపోవచ్చు కానీ సినిమా వార్తలు ఫాలో అయ్యే వారికి అందరికీ దాదాపుగా పరిచయమే. ఆయన ఎక్కువగా సినిమాలు తాను ముందే చూసేశానని చెబుతూ వాటికి రివ్యూ ఇస్తూ ఫేమస్ అయ్యాడు.

దాదాపుగా భారీ క్రేజ్ ఉన్న అన్ని సినిమాలు తాను ముందే చూసినట్లు తాను సెన్సార్ బోర్డు సభ్యుడు కావడంతో ముందే తనకు సినిమా చూపించినట్లు ఆయన సోషల్ మీడియాలో కలరింగ్ ఇస్తూ ఉంటారు. వాస్తవానికి అసలు అలాంటి వ్యక్తి ఉన్నాడో లేదో అనే విషయం మీద కూడా ఎవరికీ క్లారిటీ లేదు కానీ రోజుకు ఒక ఎకౌంటుతో వచ్చి ఉమైర్ సందు సందడి చేస్తూ ఉంటాడు. గత కొద్దిరోజులుగా బాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్ల మధ్య ఉన్న ఎఫైర్ల గురించి ఇష్టం వచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్న ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా తన ప్రతాపం చూపించాడు.

పవన్ కళ్యాణ్ ఒక డై హార్డ్ ఉమెనైజర్, అతనికి ఇప్పటికే రెండుసార్లు విడాకులు అయ్యాయి అయినా సరే అయినా ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ దొరికేశాడు, చాలామంది స్టార్ హీరోయిన్లతో ఆయన చాలా దూరం వెళ్ళాడు అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ఇలాంటి చెత్త వాగుడు వాగుతున్నావంటూ అతని మీద తిట్ల దండకాలు మొదలు పెడుతున్నారు. 

Also Read: Lauren Gottlieb To Dance on Naatu Naatu: చరణ్, ఎన్టీఆర్ లను కాదని ఈ భామతో డ్యాన్స్ చేయిస్తున్న ఆస్కార్ టీం!

Also Read: Shruthi Nanduri : నండూరి ఎంకి వారసురాలు వచ్చేసింది.. 'ఆహా'లో సందడి చేస్తున్న అమెరికన్ డాక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 
 

Trending News