Pawan kalyan: పవన్ కళ్యాణ్ తో షాయాజీ షిండే భేటీ.. ప్రకాష్ రాజ్ కు చెక్ పెడుతున్నారా..!
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు షాయాజీ షిండే భేటీ కావడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను తూలనాడుతుంటే.. మరోవైపు షాయాజీ షిండే మాత్రం పవన్ ను ఆకాశానికి ఎత్తడం రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
Pawan kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ తన అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు.
నటుడు షాయాజీ షిండే పవన్‌ను కలవడం భవిష్యత్తు రోజుల్లో APలో పచ్చదనం పెంపుదలకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈనెల 14 నుంచి ప్రారంభించే పల్లె పండగ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే పవన్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి సమావేశానికి సంబంధించిన వీడియో ఫొటోలను జనసేన కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.
మరోవైపు ఏపీలో షాయాజీ షిండే.. పవన్ కళ్యాణ్ ను కలవడం వెనక మరో రీజన్ ఉంది. ఓవైపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగంలోకి దిగడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపడుతున్నారు. ఓ రాష్ట్ర మంత్రిగా అందరి సమస్యలను చూడాల్సిన పనవ్ కళ్యాణ్ .. ఓ మతానికి కొమ్ముకాయడమేమిటని తప్పు పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఓ ధర్మానికి హాని కలిగితే రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ స్పందించడంలో తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా సినీ ఇండస్ట్రీలో మెగా, నందమూరి ఫ్యామిలీలకు వ్యతిరేకంగా ఉండటం.. మరోవైపు సనాతన ధర్మంపై విషం కక్కుతున్న ప్రకాష్ రాజ్ పై తెలుగు సినీ ఇండస్ట్రీ అనధికార బ్యాన్ విధించే అవకాశాలున్నాయి. మరోవైపు ఆయనతో సమానమైన నటులుగా రావు రమేశ్ తో పాటు షాయాజీ షిండేలకు పేరుంది. ఈ నేపథ్యంలో షాయాజీ షిండే .. పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతకరించుకుంది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter