Sebastian PC 524 Review: 'రాజావారు రాణీగారు', 'ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ మండ‌పం' చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు తన మూడో సినిమా 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు శుక్రవారం (మార్చి 4) మీ ముందుకు వచ్చారు. యువ దర్శకుడు బాలజీ సయ్యపు రెడ్డి రూపొందించిన చిత్రమిది. రేటీకటి సమస్య ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ నైట్ డ్యూటీ చేస్తే జరిగే పరిణామాల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి హీరోగా కిరణ్ అబ్బవరం హ్యాట్రిక అందుకున్నాడా? రేచీకటి సమస్యతో పోలీస్ కానిస్టేబుల్ గా ఎలా ఎంపికయ్యాడు? ఆ సమస్యతో నైట్ డ్యూటీలో పడిన హీరో పడిన పాట్లేంటో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ ఏంటంటే?\


రేచీకటి సమస్యతో బాధపడే సెబాస్టియన్ పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. అయితే తనకు రేచీకటి ఉందనే విషయాన్ని రహస్యంగా దాచిపెట్టి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. అంతటి సమస్య ఉన్నా ఏదోలా మేనేజ్ చేద్దామని అనుకుంటాడు. రోజూ ఏదో సమస్య వస్తున్నా అలా ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తాడు. 


కానీ, మదనపల్లె అనే ఊరుకు ట్రాన్సఫర్ అయిన తర్వాత సెబాస్టియన్ ఓ నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అదే రోజున ఓ మహిళ హత్యకు గురవుతుంది. అయితే ఈ కేసులో హీరో ఎదుర్కొనే సవాళ్లేంటి? హత్యను పోలీస్ కానిస్టేబుల్ ఎలా ఛేధించాడు? అనేది మిగతా కథ. 


ఎవరెలా చేశారు?


రేచీక‌టి స‌మ‌స్య ఉన్న ఓ కానిస్టేబుల్‌ గా కిరణ్ అబ్బవరం.. తనదైన నటనతో మెప్పించాడు. మహిళ హత్య తర్వాత సినిమా క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. ఆరంభంలో సినిమా ఉల్లాసంగా సాగినా.. ఆ తర్వాత కథనం కొంత బోర్ గా అనిపించింది. కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమా ఆసక్తి కరంగా మారుతుంది. ట్రైలర్ లో చూపినంత వైవిధ్యం సినిమాలో ఎక్కువ సీన్స్ లేకపోవడం గమనార్హం. 


క్లైమాక్స్ కు సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కథ బాగున్నా.. కథనం కొద్దిగా స్లోగా సాగింది. దర్శకుడు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, క్లైమాక్స్ లో అంతా చకచకా జరిగిపోవడం వల్ల ప్రేక్షకుడ్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జిబ్రాన్ సంగీతం, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.



'సెబాస్టియన్ పీసీ 524' సినిమాలో కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష ప్రధానపాత్రలో పోషించారు. ఈ సినిమాకు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించగా.. సిద్ధా రెడ్డి, బి. జయచంద్రా రెడ్డి, ప్రమోద్, రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ, రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్ఠా కీలక పాత్రలు పోషించారు. 


Also Read: Pooja Hegde Photos: వరుస ఫొటోషూట్ లతో హవా కొనసాగిస్తున్న పూజా హెగ్డే!


Also Read:  KGF 2 Trailer: సినీ అభిమానులకు హెచ్చరిక.. కేజీఎఫ్ ట్రైలర్ తుపాను రాబోతోంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook