Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
Sekhar Master Emotional శేఖర్ మాస్టర్ బుల్లితెరపై మంచి మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. శేఖర్ మాస్టర్ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలంతా కూడా శేఖర్ మాస్టర్నే కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
Sekhar Master Emotional శేఖర్ మాస్టర్ తన తండ్రి గురించి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. తన సక్సెస్‌ను తన తండ్రి చూడలేకపోయాడని, ఆ బాధ తనకు ఎప్పటికీ ఉంటుందని, ఇప్పుడు తన తండ్రి ఉంటే.. బాగుండేదని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే యాంకర్ ప్రదీప్ ఈ మధ్యే తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ పర్ఫామెన్స్ చూసి ఎమోషనల్ అయ్యారు. ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఇద్దరూ స్టేజ్ మీద కన్నీరు పెట్టేసుకున్నారు.
ఢీ షోకు సంబంధించిన తాజా ప్రోమో అందరినీ కదిలిస్తోంది. ఇందులోని కంటెస్టెంట్ ఫాదర్ సెంటిమెంట్ మీద ఓ పర్ఫామెన్స్ చేశాడు. తండ్రి విలువ.. మనం తండ్రిగా మారిన తరువాతే తెలుస్తుందని చెబుతూ.. మనం మన తండ్రిని చిన్నచూపు చూస్తే.. మన పిల్లలు మనల్ని కూడా అలానే చూస్తారు.. తల్లిదండ్రులను గౌరవించుకోవాలి అన్నట్టుగా ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాగింది.
ఆ పర్ఫామెన్స్ సాగుతున్న టైంలో శ్రద్దా దాస్ ఏడుస్తూనే ఉంది. ఇక ప్రదీప్, శేఖర్ మాస్టర్‌లు సైతం ఏడ్చారు. తండ్రి ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి.. అంటూ శేఖర్ మాస్టర్ స్టేజ్ మీదకు వచ్చి ఎమోషనల్ అయ్యాడు. అయితే ప్రదీప్‌కు తన తండ్రి గుర్తుకు వచ్చినట్టున్నాడు. రీసెంట్‌గానే ప్రదీప్ తండ్రి మరణించిన విషయం అందరికీ తెలిసిందే.
Also Read: Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే
కరోనా సమయంలోనే ప్రదీప్ తండ్రి మరణించారు. ఆ టైంలో ప్రదీప్ కూడా అన్ని షోలకు బ్రేక్ ఇచ్చాడు. కొన్ని రోజులు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రదీప్ తన రెగ్యులర్ వర్క్‌తో బిజీగా మారిపోయాడు. అయితే హీరోగా చేసిన సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. దీంతో మళ్లీ సినిమాలపై వైపు చూపు తిప్పడం లేదు. తన ఫోకస్ అంతా కూడా బుల్లితెర మీద, ఎంటర్టైన్మెంట్ షోల మీదే పెట్టేశాడు.
Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook