Sekhar Master Counters on Anchor Suma శేఖర్ మాస్టర్ బుల్లితెరపై వేసే సెటైర్లు, పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. డ్యాన్స్ షోకు జడ్జ్‌గా ఉన్నా కూడా శేఖర్ మాస్టర్ మాత్రం కామెడీ టైమింగ్‌లో మాత్రం హైలెట్ అవుతుంటాడు. అందుకే పండుగ ఈవెంట్లు, జబర్దస్త్ షోల్లో గెస్టుగా అప్పుడప్పుడు స్కిట్లు వేస్తుంటాడు. అయితే ఇప్పుడు సుమ అడ్డా షోకు గెస్టుగా వచ్చాడు. తన స్నేహితుడు జానీ మాస్టర్‌తో కలిసి శేఖర్ మాస్టర్ సుమ షోకు వచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సుమ మీదే శేఖర్ మాస్టర్ కౌంటర్ వేశాడు. నువ్వు ఈ మధ్య హీరోయిన్లతో చేస్తున్నావ్ అంటూ శేఖర్ మాస్టర్ గురించి సుమ ఓ నాటీ విషయం చెప్పాలని అనుకుంది. మీరు కూడా హీరోయినే కదా? అని శేఖర్ మాస్టర్ ఓ బిస్కెట్ వేసినట్టు కనిపిస్తోంది.


 



అవును అందుకే ఓ సినిమాను కూడా చేశాను అని సుమ అంటుంది. అవునా? చేశారా? అంటూ గాలి తీసేశాడు శేఖర్ మాస్టర్. దీంతో సుమ ఏమీ మాట్లాడలేకపోయింది. అసలు సినిమా రిలీజ్ అయిందా?అని మరోసారి కౌంటర్ వేశాడు. దీంతో సుమకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. శేఖర్ మాస్టర్‌ను ఏం చేయాలో అర్థం కాక దిండుతో కొట్టేసింది.


నిజంగానే నాకు తెలీదు అంటూ సుమ జయమ్మ పంచాయితీ సినిమా పరువుతీశాడు శేఖర్ మాస్టర్. అయితే నిజంగానే శేఖర్ మాస్టర్‌కు ఈ సినిమా వచ్చింది..పోయింది అనే విషయం కూడా తెలియనట్టుంది. అందుకే సుమ ముందే ఇలా అన్నట్టుగా కనిపిస్తోంది. సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లో ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం అందరినీ ఆకట్టుకుంది.


సుమ చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఇలా వెండితెరపై లీడ్ రోల్ చేసింది. కెరీర్ స్టార్టింగ్‌లో సుమ హీరోయిన్‌ సినిమా చేసింది. ఆ తరువాత కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. ఇక చివరకు బుల్లితెరపై యాంకర్‌గా ఫిక్స్ అయింది. ఇప్పటికీ స్టార్ యాంకర్‌గానే దూసుకుపోతోంది.


Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్


Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook