Sekhar Master wife : శేఖర్ మాస్టర్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్‌గా ఉన్నాడు. స్టార్ హీరోలందరికీ కూడా శేఖర్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడు. చిరంజీవి, బాలయ్య ఇలా అందరికీ శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఫేవరేట్‌గా మారాడు. తెలుగులో వచ్చే పెద్ద సినిమాలన్నింటికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. జానీ మాస్టర్ పక్క రాష్ట్రాల్లో కుమ్మేస్తుంటే.. శేఖర్ మాస్టర్ టాలీవుడ్‌ను దున్నేస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



శేఖర్ మాస్టర్ ఇలా తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. బుల్లితెరపైనా సందడి చేసేందుకు టైం కేటాయించుకుంటాడు. మధ్యలో బిజీగా లేని సమయంలో అయితే ఢీ వంటి షోకు బ్రేక్ ఇస్తుంటాడు. గత సీజన్‌లో ఏదో చిన్న పాటి గొడవలు జరిగినట్టున్నాయి. ఢీ షోను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. కామెడీ స్టార్స్ అనే షోను చేశాడు. అయితే ఇప్పుడు ఢీ కొత్త సీజన్‌లో మళ్లీ శేఖర్ మాస్టర్ వచ్చేశాడు. శ్రద్దా దాస్‌తో కలిసి సందడి చేస్తున్నాడు.


తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇదంతా కూడా వాలెంటైన్స్ డే వీక్ కాబట్టి.. లవ్ థీమ్‌లో పాటలకు స్టెప్పులు వేశారు. అయితే ఇందులో భాగంగా శేఖర్ మాస్టర్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ భార్యను కూడా స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. ఆమెను పాటలో స్పెషల్‌గా అప్పియరెన్స్ ఇప్పించాడు. అయితే శేఖర్ మాస్టర్ తన జడ్జ్ సీటు నుంచి స్టేజ్ మీదకు వచ్చాడు.


తన భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. ప్టేజ్ మీదే ముద్దులు కూడా పెట్టేశాడు. ఇక ఓ సీక్రెట్‌ను కూడా ప్రదీప్ అడిగి తెలుసుకున్నాడు. శేఖర్ మాస్టర్‌ను ఇంట్లో నాని అని ముద్దుగా పిలుస్తుందట. ఇక ఇదే ప్రోమోలో అమ్మ ప్రేమకు సంబంధించిన పర్ఫామెన్స్ కూడా చేశారు. ఈ ప్రోమోను చూసిన ఆడియెన్స్ నిజంగానే ఎమోషనల్ అవుతున్నారు. ది బెస్ట్ ప్రోమో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు


Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFaceboo