Vanitha Life Struggles: సీనియర్ నటుడు విజయ్ కుమార్ అందరికీ సుపరిచుతుడే. సీనియర్ హీరోయిన్ మంజులను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇక తమిళ్ మూవీలతో పాటు తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేక పేరును విజయ్ కుమారు తెచ్చుకున్నాడు. ఆయనకు ముగ్గురు కూతుర్లు. అందరూ హీరోయిన్స్‌గా నటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ కుమార్‌‌ కూతుర్లలో వనితా విజయ్ కుమార్ తరుచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల ఆమె తమిళ్‌ (Tamil) బిగ్‌బాస్‌ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన వనితా తాజాగా తన సమస్యలన్నింటినీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది. 


తనను కన్నతండ్రే ఇంటి నుంచే బయటకు గెంటేశాడంటూ కన్నీరు పెట్టుకుంది వనితా విజయ్ కుమార్. (Vanitha Vijay Kumar) చాలా మంది తాను జీవితంలో గెలవకూడదని కోరుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లి మంజుల ఎన్నో కష్టాలుపడి స్టార్‌‌ హీరోయిన్‌గా (Heroine‌) పేరు తెచ్చుకుందని.. పిల్లల కోసం ఎంతో సంపాదించిందని చెప్పుకొచ్చింది వనిత. 


అయితే తన తల్లి సంపాదించిన ఆస్తి ముగ్గురు కూతుర్లకు సమానంగా రావాల్సి ఉండగా... తన తండ్రి తనకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా చేశాడని బాధపడింది. అంతేకాదు తన తల్లి మరణించాక తనపై తన తండ్రి చాలా దారుణంగా ప్రవర్తించాడంటూ బాధపడింది. 


తన తల్లి (Mother) ఇంట్లో ఉన్న తనని అతి దారుణంగా బయటికి గెంటేశాడు అంటూ కన్నీరుమున్నీరు అయింది. తాను కట్టుబట్టలతోనే తన పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పింది. తన తండ్రికి తన మీద ఎందకంత కోపం ఉందో తనకు అర్థం కావడం లేదంది. తనకు దక్కాల్సిన ఆస్తి కోసం కోర్టు (Court) మెట్లు ఎక్కడంతో.. తన తండ్రి తమిళనాడులో నీకు అడ్రస్‌ లేకుండా చేస్తానని బెదిరించాడని వనిత చెప్పుకొచ్చింది. ఇక తన మూడు పెళ్లిళ్ల (Marriage) గురించి కూడా వనిత మాట్లాడింది. చిన్నతనంలోనే మ్యారేజ్‌ చేసుకోవడం వల్లే పెళ్లిళ్ల విలువ తనకు తెలియలేదని వనిత పేర్కొంది. అందుకే అవి ఏవీ కూడా నిలవలేదని ఆమె చెప్పింది.


Also Read: CM Jagan on Probation: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు!


Also Read: Viral Video: మూడేళ్ల కుమార్తెను జూలోని ఎలుగుబంటికి విసిరిన తల్లి.. చివరికి ఏమైందంటే? (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook