Madras HC: కోర్టు విచారణ జరుగుతుండగా మహిళతో న్యాయవాది రాసలీలలు...

Lawyer caught in compromising position: మహిళతో న్యాయవాది రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయమూర్తులు ప్రకాష్, హేమలత ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించి సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2021, 05:58 PM IST
  • మద్రాస్ హైకోర్టులో వర్చువల్ విచారణ సందర్భంగా అనుకోని ఘటన
  • మహిళతో రాసలీలల్లో మునిగి తేలిన న్యాయవాది
  • కోర్టు దిక్కరణ కింద చర్యలకు ఆదేశించిన హైకోర్టు
Madras HC: కోర్టు విచారణ జరుగుతుండగా మహిళతో న్యాయవాది రాసలీలలు...

Lawyer caught in compromising position with woman: మద్రాస్ హైకోర్టులో (Madras Highcourt) ఓ కేసు వర్చువల్ విచారణ సందర్భంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతుండగా ఓ న్యాయవాది ఓ మహిళతో అభ్యంతరకర రీతిలో కనిపించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం కోర్టు దిక్కరణ కింద అతనిపై చర్యలకు ఆదేశించింది. 

న్యాయమూర్తి ఇలంతిరయన్ ఇటీవల ఓ కేసు విచారణకు సంబంధించిన వాదనలు వింటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళతో న్యాయవాది రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయమూర్తులు ప్రకాష్, హేమలత ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించి సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆ న్యాయవాదిని తమిళనాడు బార్ కౌన్సిల్ నుంచి తొలగించారు.

ఇటీవల కర్ణాటక హైకోర్టులోనూ (Karntaka High Court) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వర్చువల్ విచారణ సందర్భంగా ఓ న్యాయవాది అర్దనగ్నంగా కనిపించాడు. అంతేకాదు, లైవ్ వీడియో కాన్ఫరెన్స్‌లోనే 20 నిమిషాల పాటు స్నానం చేశాడు. దాదాపు 80 మంది న్యాయవాదులు పాల్గొన్న ఈ విచారణలో ఆ వ్యక్తి చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు  అతనిపై చర్యలకు ఆదేశించింది. కాగా, కరోనా నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలు ఇంకా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. న్యాయవాదులు ఇంటి నుంచే ఆన్‌లైన్ విచారణకు హాజరవుతుండటంతో అడపాదడపా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

Also Read: Scrub Typhus: హైదరాబాద్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం-టెన్షన్ పెట్టిస్తోన్న మరో వ్యాధి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News