Mohan Babu: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వరదల కారణంగా ఎంతో మంది రోడ్డు మీదుకొచ్చారు. అంతేకాదు కొన్ని వందల కోట్ల నష్టం సంభవించింది. వరదల కారణంగా ఇంట్లో విలువైన గృహోపకరణాలు నీటి పాలయ్యాయి. ప్రజల అండదండలతో స్టార్స్ గా ఎదిగిన వాళ్లు ప్రజలు ఆపత్కాలంలో  ఉన్నపుడు వారికి గా అండగా నిలిబడింది. అంతేకాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ ప్రముఖులంతా కలిసి తమకు తోచిన విరాళాలను అందజేసారు. ఈ క్రమంలో  ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి ఏపీ వరదల వరద బాధితులకు తమ వంతు విరాళం అందజేసారు మోహన్ బాబు. రూ. 25 లక్షల చెక్ ను ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి చంద్రబాబుకు అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షల చెక్ ను అందజేసినట్టు తెలిపారు.  ఈ క్రమంలో ఆ చెక్కుని అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది.  ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి వరదల నేపథ్యంలో కాసేపు రాష్ట్ర రాజకీయాల గురించి ముచ్చటించారు.  మోహన్ బాబు విషయానికొస్తే.. అటు నటుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా.. విద్యా సంస్థల అధినేతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


 ప్రస్తుతం ఈయన తనయుడు మంచు విష్ణు హీరోగా 'కన్నప్ప' సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ యేడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ నటిస్తుండంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.  హీరోగా మంచు విష్ణుకు తొలి ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. గతంలో కన్నప్ప కథలపై 'శ్రీకాళహస్తీ మహత్యం, భక్త కన్నప్ప చిత్రాలు వచ్చాయి. వాటికి ధీటుగా కన్నప్ప మూవీ ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది చూడాలి.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.