Shah Rukh Khan Hospitalised: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిపోయారు. క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో షారూక్‌ ఖాన్ సందడి చేశాడు. తెల్లారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేరారు. అయితే షారూక్‌కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. కోలుకుంటున్నారని వెల్లడించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL Qualifier 1 KKR vs SRH: ఫైనల్‌లోకి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌.. సన్‌రైజర్స్‌ ఘోర వైఫల్యం


అయితే షారూక్‌కు ఏం జరిగిందనేది విస్తృతంగా చర్చ జరుగుతోంది. మ్యాచ్‌కు హాజరైన సమయంలో షారూక్‌ ఎండ దెబ్బకు గురయ్యాడని తెలుస్తోంది. డీ హైడ్రైషేన్‌కు గురవడంతో షారూక్‌ ఆస్పత్రి పాలయినట్లు సమాచారం. అయితే షారూక్‌కు ఆస్పత్రి పాలవడంతో ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు. దీంతోపాటు కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ అభిమానులు కూడా షారూక్‌ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. అయితే షారూక్‌కు ఏమైందనే విషయమై కేకేఆర్‌ ఫ్రాంచైజీ, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.

Also Read: Film Exhibitors: నిర్మాతలపై తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్ల యుద్ధం.. సినీ ప్రియులకు భారీ షాక్‌.. బెనిఫిట్ షోలు రద్దు


 


అహ్మదాబాద్‌లోని స్టేడియంలో మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టు తలపడిన విషయం తెలిసిందే. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన చేసిన కేకేఆర్‌ హైదరాబాద్‌పై విజయం సాధించి ఐపీఎల్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విజయంపై జట్టు యజమాని అయిన షారూక్‌ ఖాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ ఆసాంతం స్టాండ్స్‌లో కూర్చుని చూసిన షారూక్‌ విజయం అనంతరం మైదానంలోకి వచ్చాడు. మైదానం చుట్టూ కలియతిరిగాడు. అభిమానులు, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ సందడి చేశాడు. ఆ సమయంలో కొందరికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ.. ఫొటోలు దిగుతూ వెళ్లాడు. అది జరిగిన తెల్లారి బుధవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది.


అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌ వలన షారూక్‌ అస్వస్థతకు గురయినట్లు చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ప్రతి మ్యాచ్‌కు హాజరై షారూక్‌ సందడి చేస్తున్న విషం తెలిసిందే. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎండలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ ఎండకు తట్టుకోలేక షారూక్‌ నీరసించినట్లు కేకేఆర్‌ వర్గాలు చెబుతున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter