Film Exhibitors: నిర్మాతలపై తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్ల యుద్ధం.. సినీ ప్రియులకు భారీ షాక్‌.. బెనిఫిట్ షోలు రద్దు

Now Onwards No Benefit Shows Says Telangana Film Exhibitors: సినీ ప్రియులకు థియేటర్‌ యాజమాన్యాలు మరో భారీ షాక్‌ ఇచ్చాయి. ఇకపై బెనిఫిట్‌ షోలు, అదనపు షోలు ఉండవని ప్రకటించాయి. నిర్మాతలపై తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు యుద్ధమే ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 22, 2024, 07:43 PM IST
Film Exhibitors: నిర్మాతలపై తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్ల యుద్ధం.. సినీ ప్రియులకు భారీ షాక్‌.. బెనిఫిట్ షోలు రద్దు

Telangana Film Exhibitors: మల్టీప్లెక్స్‌ థియేటర్ల రాకతో చిన్న సినిమా థియేటర్లు బోసిపోతున్నాయి. దీనికితోడు ఓటీటీల ప్రభావం వీటిపై తీవ్రంగా పడింది. అంతేకాకుండా సరైన సినిమాలు రాకపోవడంతో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వారాల థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు సినీ రంగానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలకు పలు విషయాల్లో ఆల్టిమేటం జారీ చేశారు. లేకపోతే థియేటర్లు మూసివేస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధానాలు తెలుగు సినీ పరిశ్రమలో అమలు కావాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Mohanlal: క్రేజీ బ్లాక్ బస్టర్‌ సీక్వెల్‌లో జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్.. ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్..

 

సరైన సినిమాల విడుదల లేకపోవడం.. ప్రేక్షకుల సంఖ్యం తగ్గుతుండడం.. వరుసగా నష్టాల పాలవుతుండడంతో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ యాజమాన్యాలు బంద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు కీలకమైన విషయాలు మాట్లాడారు. సినీ నిర్మాతలు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. పదేళ్లలో 2 వేల సింగిల్‌ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయని వివరించారు. మిగతా థియేటర్లు కూడా మూతపడే అవకాశం ఉందని.. నిర్మాతలు సహకరించాలని కోరారు.

Also Read: Samantha: నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత షాకింగ్ పోస్ట్..

ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు ఎగ్జిబిటర్లకు పర్సంటేజీ ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటరలు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు థియేటర్లలో ప్రదర్శించలేమని స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్‌ తరహాలోనే పర్సంటేజీలు చెల్లిస్తే ప్రదర్శిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ డిమాండ్‌లపై తెలుగు సినీ నిర్మాతలకు జూలై 1వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే త్వరలోనే విడుదలవుతున్న భారీ సినిమాలు కల్కి 2898 ఏడీ, పుష్ప 2, గేమ్‌ ఛేంజర్‌, భారతీయుడు 2 సినిమాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు వివరించారు. అవి కాకుండా మిగతా సినిమాలన్నీ మల్టీప్లెక్స్‌ తరహాలో పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శిస్తామని తెలిపారు.

ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయాన్ని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు తీసుకున్నారు. ఇకపై బెనిఫిట్‌ షోలు, అదనపు షోలు ప్రదర్శించమని ప్రకటించారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని నివారణ కోసం బెనిఫిట్‌ షోలు, అదనపు షోలు ఇకపై ప్రదర్శించమని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News