IPL Qualifier 1 KKR vs SRH: ఫైనల్‌లోకి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌.. సన్‌రైజర్స్‌ ఘోర వైఫల్యం

IPL 2024 Kolkata Knight Riders Enters Final 4th Time Sunrisers Hyderabad Allround Fail: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోర వైఫల్యంతో మ్యాచ్‌ను చేజార్చుకోగా.. అన్ని రంగాల్లో సత్తా చాటిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నాలుగోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 21, 2024, 11:07 PM IST
IPL Qualifier 1 KKR vs SRH: ఫైనల్‌లోకి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌.. సన్‌రైజర్స్‌ ఘోర వైఫల్యం

IPL 2024 KKR vs SRH: ఐపీఎల్‌ ట్రోఫీ కోసం మరోసారి కన్నేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అన్నింటా విఫలమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్వల్ప స్కోర్‌ను సునాయాసంగా ఛేదించిన కోల్‌కత్తా ట్రోఫికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై కోల్ కత్తా విజయం సాధించింది.

Also Read: IPL Qualifier 1 KKR vs SRH: హైదరాబాద్‌ నడ్డి విరిచిన కోల్‌కత్తా బౌలర్లు.. స్వల్ప స్కోరుకు పరిమితం

అహ్మదాబాద్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. 160 స్వల్ప లక్ష్యాన్ని 38 బంతులు మిగిలిండగానే 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ మ్యాచ్‌ను ముగించింది. శ్రేయస్‌, వెంకటేశ్ అయ్యర్‌ ఇద్దరు అర్ధ శతకాలతో జట్టుకు విజయాన్ని అందించారు. రహమానుల్లా గుర్బాజ్‌ 23 పరుగులు చేసి వెనుతిరిగాడు. టాప్‌ బ్యాటర్‌ సునీల్‌ నరైన్‌ 21 స్కోర్‌కు పరిమితమయ్యాడు. అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన కెప్టెన్‌ శ్రేయస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ ఇద్దరు ఆడుతూ పాడుతూ మ్యాచ్‌ను ముగించారు. 24 బంతుల్లో 58 పరుగులు చేసిన శ్రేయస్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 28 బంతుల్లో వెంకటేశ్‌ 51 స్కోర్‌ చేశాడు.

Also Read: IPL 2024 PBKS vs SRH: హైదరాబాద్‌ తడాఖా.. పంజాబ్‌పై విజయంతో రెండో స్థానానికి సన్‌రైజర్స్‌?

అన్నింటా విఫలం
అతి తక్కువ స్కోర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు కాపాడలేకపోయారు. బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ హైదరాబాద్‌ విఫలమై మ్యాచ్‌ను చేజార్చుకుంది. నటరాజన్‌, కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఇద్దరు ఒక్కో వికెట్‌ తీశారు. మిగతా నలుగురు బౌలింగ్‌లో వికెట్లు తీయకపోయినా పరుగులకు కళ్లెం వేయలేకపోయారు. ఇక ఫీల్డింగ్‌లోనూ ఆటగాళ్లు తీవ్ర నిరాశపర్చారు. ట్రావిస్‌ హెడ్‌, పాట్‌ కమిన్స్‌ కీలకమైన వికెట్ల క్యాచ్‌లు చేజార్చారు. ఆరంభం నుంచి హైదరాబాద్‌కు దురదృష్టం వెంటాడింది.

కుప్పకూలిన బ్యాటింగ్
అద్భుతమైన ఫామ్‌తో ఐపీఎల్‌ క్వాలిఫయర్‌ 1కు దూసుకొచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 10.3 ఓవర్లలో 159 పరుగులు చేసి కుప్పకూలింది. బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. రెండో బంతికే ట్రావెస్‌ హెడ్‌, రెండో ఓవర్‌లో అభిషేక్‌ శర్మ ఔటవడం కలకలం రేపింది. రాహుల్‌ త్రిపాఠి, క్లాసెన్‌ మినహా ఎవరూ బ్యాటింగ్‌లో మెరిపించలేదు. అభిషేక్‌ శర్మ (3) క్యాచ్‌ ఇచ్చేసి వెనక్కి వచ్చాడు.

అనంతరం రంగంలోకి దిగిన అభిషేక్‌ శర్మ అద్భుతంగా పోరాడి ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అభిషేక్‌ మైదానంలో నిలబడి 55 పరుగులు సాధించాడు. నితీశ్ కుమార్‌ రెడ్డి (9) కూడా తక్కువ పరుగులే చేశాడు. షాబాద్‌ అహ్మద్‌, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సన్వీర్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ క్రమంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. 21 బంతుల్లో అతి కష్టంగా 32 స్కోర్‌ చేశాడు. అబ్దుల్‌ సమద్‌ విలువైన 16 పరుగులు చేశాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌తో కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌ను చేజార్చుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ 2లో అదృష్టం పరీక్షించుకోనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News