Shah Rukh Khan Meets His Son: ఆర్యన్ ఖాన్‌ను కలిసేందుకు ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లిన షారుక్
Mumbai Cruise Drug Case: డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పరామర్శించారు. గురువారం ఉదయం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లిన షారుక్.. ఆర్యన్ ఖాన్‌తో దాదాపుగా 20 నిమిషాలు మాట్లాడినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.
Mumbai Cruise Drugs Case Live Updates: ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిసేందుకు (Shah Rukh Khan Meets His Son) బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan News) జైలుకు వెళ్లారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ వివరాల మేరకు.. గురువారం ఉదయం (Aryan Khan in Arthur Road Prison) ఆర్యన్ ఖాన్‌ను కలిసిన షారుక్.. దాదాపుగా 20 నిమిషాలు మాట్లాడినట్లు సమాచారం. ఆర్యన్ ఖాన్‌ను కలిసేందుకు ముందు షారుక్ ఖాన్‌కు సంబంధించిన ఆధార్ కార్డ్‌తో ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఓ ప్రత్యేక గదిలో ఆర్యన్ ఖాన్‌ను కలిసిన షారుక్ ఖాన్.. నలుగురు జైలు అధికారుల సమక్షంలో వారిద్దరు మాట్లాడుకున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. అయితే షారుక్ రాక నేపథ్యంలో అతడికి ప్రత్యేక ఏర్పాట్లు వంటివి చేయలేదు.
బెయిల్ నిరాకరణ
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కు మరోసారి ముంబై స్పెషల్ కోర్టులో(Mumbai Special Court) చుక్కెదురైంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ముంబై ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఆర్డర్‌ను రిజర్వ్ చేసిన ముంబై స్పెషల్ కోర్టు.. బుధవారం జరిగిన విచారణలో ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టంచేసింది. దీంతో ఆర్యన్ ఖాన్‌కు మరోసారి బెయిల్ విషయంలో నిరాశ తప్పలేదు. అక్టోబర్ 3న ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయి ఇప్పటికే 18 రోజులు గడిచిపోయింది. గత పద్దెనిమిది రోజులుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో (Aryan Khan in Arthur Road prison) ఆర్యన్ కాలం వెళ్లదీస్తున్నాడు. గత వారం చివరిసారిగా ఆర్యన్ ఖాన్ పెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై ప్రత్యేక ముంబై కోర్టు తన ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది.
'ఈ కేసులో పసలేదు!'
ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసినప్పుడు అతడి వద్ద నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోనందున అతడిపై నమోదైన కేసులో పస లేదని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాదుల వాదన. అయితే, ఆర్యన్ ఖాన్ లాంటి వాళ్లు జైలు నుంచి బెయిల్‌పై బయటికొస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.
ఆర్యన్ ఖాన్‌ను ఇంకొన్ని రోజులు కస్టడీకి అప్పగిస్తే.. అతడి నుంచి డ్రగ్స్ సరఫరాదారులకు (Drugs peddlers) సంబంధించిన సమాచారం రాబట్టవచ్చని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(Narcotics Control Bureau) కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీబీ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను (Aryan Khan's bail plea live updates) కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్.. తెరపైకి సంచలన నిజాలు
Also Read: ఆర్యన్ ఖాన్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్న Mumbai Court
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.