Pathaan Beats RRR in Overseas బాలీవుడ్‌ గత రెండేళ్లుగా చీకట్లో ఉండిపోయింది. ఖాన్ హీరోలు అడ్రస్ లేకుండాపోయారు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశారు. అక్షయ్ కుమార్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఇలా బాలీవుడ్‌ సినిమాలు అన్నీ కూడా పాతాళ స్థాయిలోకి వెళ్లాయి. సుశాంత్ సింగ్ వంటి టాలెంటెడ్‌ హీరోను తొక్కేసిన బాలీవుడ్‌కు ఇలాంటి గతే పడుతుందని అంతా శాపనార్థాలు పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బాలీవుడ్ ఇప్పుడు ఊపిరి తీసుకుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఒక్కసారిగా దశదిశను మార్చేశాడు. అటు షారుఖ్‌ కెరీర్, ఇటు బాలీవుడ్‌ గతి కూడా మారిపోయింది. పఠాన్ సినిమా ఇప్పుడు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇంకా ఇలానే దూసుకుపోతూ ఉంటే.. కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది. బాహుబలి సినిమా రికార్డులను కూడా టచ్ చేసేలా ఉంది.


ఇప్పటికే పఠాన్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల కోట్లకు పైగా వచ్చాయి. ఓవర్సీస్‌లో అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను టచ్ చేయబోతోంది. ఈ వీకెండ్‌లోపు ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను అక్కడ పఠాన్ బీట్ చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 832కోట్లను కొల్లగొట్టేసింది. ఇండియాలో 515 కోట్లు, ఓవర్సీస్‌లో 317 కోట్లు రాబట్టేసింది. ఓవర్సీస్‌లో ఈ మూవీ దగ్గరదగ్గరగా 38.68 మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసింది.


పఠాన్ మూవీ ఇలానే కొనసాగితే.. ఈ వారాంతంలోపే వెయ్యి కోట్లను టచ్ చేస్తుంది. ఇప్పటికే హిందీ సినిమా హిస్టరీలో వరల్డ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా పఠాన్ సినిమా నిలిచింది. ఇంకో మూడు నాలుగు రోజులు ఇలానే హవా కొనసాగితే వెయ్యి కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేస్తుంది.


Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?


Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి