Khan Trio Dance: నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన బాలీవుడ్ ఖాన్స్.. వీడియో వైరల్
Naatu Naatu: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట ఏకంగా ఆస్కారిక్ సైతం నామినేట్ అయ్యి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి లో ముగ్గురు బాలీవుడ్ ఖాన్స్ కలిసి ఈ పాటకు డాన్స్ చేయడం వైరల్ గా మారింది.
Bollywood Khans Dance::ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కి ప్రపంచవ్యాప్తంగా మహామహులు తరలివచ్చారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీస్ డాన్సులతో నిండిపోయి అందరిని అలరించింది.
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, వివాహం మరికొన్ని రోజుల్లో జరగనుంది. దీంతో ఇప్పుడు గుజరాత్ లోని జామ్ నగర్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఎంతో గ్రాండ్గా జరిపిస్తున్నారు అంబానీ. మార్చి 1న ప్రారంభమైన ఈ సెలబ్రెషన్స్ నేటితో ముగియనున్నాయి.
ఈ ఈవెంట్ లో మొదటిరోజు పాప్ సింగర్ రిహాన్న తన ప్రదర్శనతో ఊర్రూతలూగించింది. ఆ వీడియో నిన్న మొత్తం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఇక రెండో రోజు జరిగిన సంగీత్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్స్‌తో సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ ముగ్గురు బాడా ఖాన్స్ కలిసి నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. నాటు నాటు పాటకు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ డాన్స్ చేసి వావ్ అనిపించారు.
షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత ఒకే స్టేజ్ పై కలిసి కనిపించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీరు ముగ్గురు కలిసి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు కాలు కదిపారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టేప్ ను మార్చేసి నవ్వులు పూయించాడు సల్మాన్.
ఇక సల్మాన్ ఖాన్ తరువాత షారుఖ్ ఖాన్ సిగ్నేచర్ డాన్స్ స్టెప్ చేసి మరింత అలరించారు. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి స్టేజ్ పై ఈ పాటకు చేసిన అల్లరి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సాంగ్ అవ్వగానే షారుక్ ఖాన్ పఠాన్ సినిమాలోని జూమ్ కో పఠాన్ పాటకు అదరగొట్టేశాడు. చివరగా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ చయ్యా చయ్యా పాటకు డాన్సులు వేశారు. ఈ డాన్స్ కోసం షారుక్, సల్మాన్ బ్లాక్ కుర్తాలు ధరించగా.. అమీర్ మాత్రం గ్రీన్ కలర్ కుర్తాలో కనిపించాడు.
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter