Shahid Kapoor Jersey Trailer: 'కబీర్ సింగ్'తో (Kabir Singh) బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్ కపూర్ (Shahid Kapoor).. తెలుగు సినిమాలపై మనసు పారేసుకున్నాడు. 'అర్జున్ రెడ్డి రీమేక్'గా (Arjun Readdy)హిందీలో వచ్చిన 'కబీర్ సింగ్' తో బాలీవుడ్  (Bollywood) బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ హీరో.. ఇపుడు తెలుగులో నాని (Hero Nani) నటించిన 'జెర్సీ' (Jersey) సినిమా బాలీవుడ్ రీమేక్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. తెలుగులో గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి మనకు తెలిసిందే.. అలాగే హిందీ రీమేక్ కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించటానికి చాలా కష్టపడ్డారు.. షాహిద్ కపూర్ కూడా క్రికెటర్ గా కనపడటానికి నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ రోజే హిందీ జెర్సీ సినిమా ట్రైలర్ (Hindi Jersey Movie Trailer) ను విడుదల చేసిన టీమ్.. మీరే ఒకసారి చూసి నాని పాత్రలో షాహిద్ కపూర్ ఎలా నటించాడో మీరే ఒకేసారి చూడండి. 



Also Read: Alert: మీకు పెన్షన్ వస్తుందా..? అయితే నవంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం!


"క్రికెట్ నుండి తప్పుకున్న ఒక క్రికెటర్ కొడుకు కోసం మళ్లీ టీమిండియాకు సెలెక్ట్ అవ్వటంలో.. అతడు ఎదుర్కొన్న సవాళ్లు.." పూర్తిగా క్రికెట్ తో కూడిన ఎమోషనల్ స్టోరీ ఇది. హిందీ జెర్సీలో 'మృణాలిని ఠాకూర్' (Mrunal Thakur) షాహిద్ కపూర్ కు జంటగా నటిస్తుంది. శరద్ కేల్కర్.. పంకజ్ కపూర్ .. శిశిర్ శర్మ ముఖ్య పాత్రల్లో నటించగా.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. 




చివరగా.. డిసెంబర్ 31 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధం అయింది. హిందీలో రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ (Allu Arvind), దిల్ రాజు (Dil Raju),  అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో బడా నిర్మాతలుగా పేరున్న  అల్లు అరవింద్, దిల్ రాజు ఈ సినిమాతో నేరుగా బాలీవుడ్ లో ఆరంగేట్రం చేయనున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. 


Also Read: Viral Video: గ్లాసులో వాటర్ తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి